Kakarakaya Pulusu Kura: తెలంగాణ స్టైల్లో కాకరకాయ పులుసు రెసిపీ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం..
Kakarakaya Pulusu Kura Recipe In Telugu: కాకరకాయ కూరను తినేందుకు చాలామంది ఇష్టపడరు అయితే అలాంటి వారి కోసం మేము ఈరోజు ప్రత్యేకమైన పులుసు రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అయితే ఈ రెసిపీ కి కావాల్సిన పదార్థాలు ఏంటో.. తయారీ విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Kakarakaya Pulusu Kura Recipe In Telugu: కాకరకాయ కూరను చాలామంది తినేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా పిల్లలు అయితే అస్సలు తినరు. నిజానికి కాకరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఔషధ గుణాలు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులను శరీరాన్ని రక్షిస్తాయి. కాబట్టి వయస్సు మళ్ళిన వారిని వైద్యులు తరచుగా ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తూ ఉంటారు. డయాబెటిస్తో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఆహారంలో కాకరకాయను తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలోని చక్కర పరిమాణాలను నియంత్రించుకోవచ్చు. అంతేకాకుండా మరెన్నో లాభాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా కాకరకాయ కూరను తినని వారు ఫ్రైకి బదులుగా పులుసుని ట్రై చేయొచ్చు. ఫ్రై కాస్త చేదుగా అనిపించినప్పటికీ పులుసు మాత్రం చాలా బాగుంటుంది. కాబట్టి కాకరకాయను పులుసుగా వండుకుంటే పిల్లలు తినే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలామంది ఈ కూరను వండుకునే క్రమంలో కొన్ని తప్పులు చేస్తున్నారు దీనికి కారణంగా కూర మొత్తం చేదుగా రుచి లేకుండా పోతోంది. అయితే మీ మదించే ఖచ్చితమైన కొలతలతో తయారు చేస్తే అద్భుతమైన రుచికరమైన కాకరకాయ పులుసును పొందడం ఖాయం.
కావాల్సిన పదార్థాలు:
2 కాకరకాయలు
1 టీస్పూన్ పసుపు
1 టీస్పూన్ మిరపకాయ పొడి
1 టీస్పూన్ ధనియాల పొడి
1/2 టీస్పూన్ జీలకర్ర పొడి
1/4 టీస్పూన్ గరం మసాలా
2 టేబుల్ స్పూన్ల నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1 టీస్పూన్ జీలకర్ర
1 చిన్న ఉల్లిపాయ, తరిగిన
2 టమాటాలు, తరిగిన
1/2 కప్పు పెరుగు
1/2 కప్పు నీరు
ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం:
ముందుగా కాకరకాయలను ఒక చిన్న గిన్నెలో తీసుకోవాల్సి ఉంటుంది. అందులోనే నీటిని పోసుకొని బాగా శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు, మిరపకాయ పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కలిపి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక పాన్లో నూనె వేడి చేసి, ఆవాలు, జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించాల్సి ఉంటుంది.
వేయించిన తర్వాత అందులోనే ఉల్లిపాయ వేసి, బంగారు గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.
అందులోనే టమాటాలు వేసి, మెత్తబడే వరకు వేయించాలి. ఇందులోని పక్కన పెట్టుకున్న మసాలా పొడిని వేసి మరో రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత పసుపు మిశ్రమాన్ని వేసి, ఒక నిమిషం పాటు వేయించి బాగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న పోపులో కాకరకాయ ముక్కలు, పెరుగు, నీరు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత మూత పెట్టి, 10 నుంచి 15 నిమిషాలు లేదా కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి.
చిట్కాలు:
చేదు తగ్గించడానికి, కాకరకాయ ముక్కలను ఉప్పు నీటిలో 10 నిమిషాలు నానబెట్టి వాటిని బాగా శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది.
కాకరకాయ పులుసు మరింత రుచిగా ఉండడానికి కొత్తిమీర ఆకులను కూడా గార్నిష్ చేసుకోవచ్చు.
ఈ కూర మరింత రుచిగా తయారు చేసుకోవడానికి పోపులో ఇంగువను కూడా వినియోగించవచ్చు.
పోషక విలువలు:
కాకరకాయ పులుసులో విటమిన్లు ఫైబర్ ఖనిజాలు అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని ఫ్రీడాటికల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా మధుమేహం నుంచి విముక్తి లభిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి