Khajur Dry Fruit Laddu: ఖర్జూర డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రతి రోజు ఒకటి తింటే దీర్ఘకాలిక వ్యాధులకు చెక్!
Khajur Dry Fruit Laddu Benefits: ఖర్జూర డ్రై ఫ్రూట్స్ లడ్డును ప్రతి రోజు తినడం వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి ప్రతి రోజు తినడం వల్ల తీవ్ర వ్యాధులు దూరమవుతాయి.
Khajur Dry Fruit Laddu Benefits: ఖర్జూర పండ్లలో ఎన్ని రకాల ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే.. అందుకే వీటిని సూపర్ ఫుడ్స్ గా కూడా భావిస్తారు. అంతేకాకుండా ఖర్జూర పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే స్మూతీలా చేసుకుని తాగడం వల్ల రక్తహీనత సమస్యలు దూరం అవుతాయి అంతేకాకుండా రక్తంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు బయటకు వస్తాయి.
ఖర్జూర పండ్లతో తయారుచేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డూని ప్రతిరోజూ తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో ఉండే గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూను తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.
ఖర్జూర పండ్ల లడ్డు తయారీ:
లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు:
పావు కేజీ ఖర్జూర పండ్లు
150 గ్రాముల ఆల్ మిక్స్ డ్రైఫ్రూట్స్
25 గ్రాముల నెయ్యి
ఒక టీ స్పూన్ ఏలకుల పొడి
లడ్డు తయారీ విధానం:
ముందుగా ఈ లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ పై బౌల్ పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఆ బౌల్లో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి.
ఇలా వేడి చేసుకున్న తర్వాత గింజలను తీసిన ఖర్జూర పండ్లను వేసి కొద్దిసేపు వేయించుకోవాలి.
ఇలా వేయించుకున్న తర్వాత మరో స్టవ్ పై మరో బౌల్ పెట్టి అందులో కాస్తంత నెయ్యిని వేసి.. వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాల్సి ఉంటుంది.
ఇలా డ్రైఫ్రూట్స్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాల్సి ఉంటుంది.
ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఖర్జూర వేయించిన బౌల్లో వేసి.. బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే యాలకుల పొడి వేసి మరో ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలి.
ఆ మిశ్రమాన్ని బాగా కలిపిన తర్వాత చిన్న చిన్న లడ్డూల్లా తీసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారుచేసిన లడ్డూలను ఉదయం పూట ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Aslo Read: IPL 2023 Playoff Scenario: ఢిల్లీ ఔట్.. సన్‌రైజర్స్ డౌట్! ఐపీఎల్ 2023 ప్లే ఆఫ్స్ అవకాశాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.