Kidney Disease Warning Sign: కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన భాగం.. ఇది మన శరీరంలో రక్తాన్ని మురికిని ఫిల్టర్ చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా మూత్రపిండాలు శరీరంలో స్వచ్ఛమైన రక్త ప్రసరణ చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. అయితే చాలా మందిలో ఆధునిక జీవన శైలి కారణంగా కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీలు దెబ్బతిని వివిధ రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే శరీరంలో కిడ్నీ సమస్యలు రావడం వల్ల శరీరంలో పలు లక్షణాలు, ఇన్ఫెక్షన్స్‌ వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లక్షణాలు తప్పవు:
1. అలసట సమస్యలు:

కిడ్నీలు తీవ్రంగా దెబ్బ తినడం కారణంగా మూత్రపిండాల వడపోత ప్రక్రియలో మార్పులు వస్తాయి. దీంతో శరీరంలో విషపదార్ధాలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల బలహీనత రావడం మొదలవుతుంది. అలసట సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.


2. నిద్ర లేకపోవడం:
మూత్రపిండాల పనితీరులో ఆటంకం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. దీని కారణంగా నిద్రలేమి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండి శరీరపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.


3. దురద:
కిడ్నీ సమస్య వల్ల చాలా మంది శరీరాల్లో టాక్సిన్స్ పేరుకుపోతాయి. అంతేకాకుండా మురికి రక్తంలో చేరడం మొదలవుతుంది..దీని కారణంగా చర్మంలో దురద సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.


4. మూత్రం రంగులో మార్పులు:
కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఎక్కువ ప్రొటీన్లు బయటకు రావడం మొదలవుతుంది. దీని కారణంగా, మూత్రం యొక్క రంగు పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతుంది. అంతేకాకుండా కొందరిలో ముత్రం వెళ్తున్నప్పుడు నురుగు, రక్తం కూడా వస్తుంది.


5. కాళ్లలో వాపు:
మూత్రపిండాలు మన శరీరం నుంచి సోడియంను విసర్జించలేనప్పుడు.. అది శరీరంలోనే పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా పాదాలు, ముఖంలో వాపు ఇతర సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.


Also Read; Prashanth Neel Clarity: వెంకటేష్ మహా ప్రశ్నలకు అప్పట్లోనే సమాధానం చెప్పిన ప్రశాంత్ నీల్.. వీడియో వైరల్!


Also Read: Amala Paul Dance Video: డ్యాన్స్ వీడియో షేర్ చేసి టాప్ లేపేసిన అమలా పాల్.. అందాలన్నీ చూపిస్తూ టీజింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook