Kiwi Fruit Benefits: కివీ పండు తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?
Benefits of Kiwi: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్లలో కివీ కూడా ఒకటి. దీనిని రోజూ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Kiwi Health Benefits: కివీ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఎక్కువగా ఈ పళ్లను మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటాం. మిగతా పళ్లతో పోలిస్తే దీని రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లలో పైబర్, విటమిన్‌లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కివీ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
కివీలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకునే వారు ఈ పండును తప్పనిసరిగా తినాలి. ఈ ప్రూట్ లో పొటాషియం, విటమిన్ సి మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. రోజూ ఒక మీడియం సైజ్ కివీ తీసుకుంటే చాలు.
కివి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
1. గుండె జబ్బులు ఉన్నవారు తరచుగా కివీని తినడం వల్ల చాలా మేలు జరుగుతుంది.
2. హైబీపీ ఉన్నవారు కివీని తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.
3. కివీ.. తక్కువ కేలరీలు కలిగి ఉన్న పండు. ఇది శరీరంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్బుతంగా పనిచేస్తుంది.
4. కివీ తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిద్ర బాగా పడుతుంది.
5. కివీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ముఖంపైన ఉన్న ముడతలు పోవడంతోపాటు చర్మానికి నిగారింపు వస్తుంది.
6. ఉదర సంబంధిత సమస్యలు ఉన్నవారు కివీని తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది.
Also Read: Ginger Effects: అల్లం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.
7. కివిలో ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి.
8. కివి తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
9. మానసిక సమస్యలతో బాధపడేవారు ఒత్తిడిని తగ్గించుకోవడానికి కివిని తప్పనిసరిగా తినాలి.
10. రోగనిరోధక శక్తిని పెంచడంలో కివీ అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకుంటుంది.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Women Health Tips: మహిళల్లో ఆ విటమిన్ లోపిస్తే హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook