Jasmine Benefits: మల్లెపూలతో పరిమళమే కాదు, అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు కూడా
Jasmine Benefits: వేసవి వచ్చిందంటే చాలు..మండే ఎండలే కాదు..గుభాళించే మల్లెపూలు కూడా ఉంటాయి. మల్లెలంటే..మగువకు అందమే కాదు..ఇష్టం కూడా. మల్లెపూలు ధరించిన మగువలంటే మగాళ్లు పడిఛస్తారు కూడా. మల్లెపూలు ఓ దివ్యౌషధం కూడా అని తెలుసా..
Jasmine Benefits: వేసవి వచ్చిందంటే చాలు..మండే ఎండలే కాదు..గుభాళించే మల్లెపూలు కూడా ఉంటాయి. మల్లెలంటే..మగువకు అందమే కాదు..ఇష్టం కూడా. మల్లెపూలు ధరించిన మగువలంటే మగాళ్లు పడిఛస్తారు కూడా. మల్లెపూలు ఓ దివ్యౌషధం కూడా అని తెలుసా..
వేసవి వస్తే ఎండలతో ఎంత ఇబ్బంది పడతామో..మల్లెపూలతో మగువలు అంతగా ఇష్టపడతారు. మార్కెట్‌లో ప్రస్తుతం మల్లెపూలు వచ్చేశాయి. మల్లెపూలంటే మహిళలకు చాలా ఇష్టం. అందుకే మల్లె అందం మగువకెరుక. మనసు బాధా తెలియదా అని అన్నారు. మరోవైపు వేసవి కాబట్టే..ఇది మల్లెల వేళ అనీ...అంటూ పాడుకుంటుంటారు. సృష్టిలో లభించే అందమైన పూలలో మల్లెపూల స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. మల్లెపూలు కేవలం సువాసనకే కాదు..ఓ దివ్యౌషధంలా కూడా ఉపయోగపడతాయని తెలుసా. మల్లెపూలు కేవలం మానసిక ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా మెడిసిన్‌లా ఉపయోగపడతాయి. వివిధ సమస్యలకు మల్లెపూలను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా ఉన్న మల్లెల్ని మెత్తగా నూరి..తడిబట్టపై చుట్టి కళ్లపై పెట్టుకుంటే కళ్లలో నీళ్లు కారడం, తడి ఆరడం, కళ్లు మూసినా, తెరిచినా చికాకు ఉండటం వంటి సమస్యల్నించి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుంది. ఇక మీకెప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో వాసనకట్టు కడితే ఉపశమనం కలుగుతుంది. మల్లెల్లోని సువాసన మనసుకు ఆహ్లాదాన్ని ఇవ్వడమే కాకుండా తలనొప్పిని తగ్గిస్తుంది.
కళ్లు మంటగా ఉన్నా..కంటిలో నొప్పి ఉన్నా సరే మల్లెల కషాయాన్ని వాడితే తగ్గుతుంది. మల్లెపూలు, ఆకులతో కషాయం కాయాలి. ఈ కషాయాన్ని వడగట్టి చల్లార్చిన తరువాత రెండు వంతుల కషాయంలో ఓ వంతు నువ్వుల నూనె, ఓ వంతు కొబ్బరినూనె, ఒక స్పూన్ బాదం నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండుసార్లు తలకు మర్దనా చేస్తే మంచి ఉపశమనం కలుగుతుంది. ఇక నిత్య జీవితంలో తరచూ ఎదురయ్యే మానసిక వ్యాకులత, డిప్రెషన్ , అతికోపం, మానసిక చంచలత్వాన్ని స్థిరపర్చి శాంతపరిచే స్వభావం మల్లెపూలకు ఉందంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. చక్కటి సువాసన వెదజల్లే గుప్పెడు పూలను దిండు కింద పెట్టి పడుకోవడం గానీ లేదా దీర్ఘంగా సువాసన పీల్చడం గానీ చేయాలి. ఇలా రోజుకు పదిసార్లు చేస్తే నిద్ర హాయిగా పడుతుంది. మనస్సు స్థిమితంగా ఉంటుంది.
మధుమేహంతో బాధపడుతున్నవారు మల్లెపూల చాయ్ తాగాల్సిందే. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గంచే గుణం మల్లెపూలకు ఉంది. ఇక జుట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. దీనికోసం కొబ్బరినూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టాలి. తరవాత కాచి వడగట్టాలి. చల్లారిన తరువాత తలకు మర్దనా చేసుకుంటే జుట్టు కుదుళ్లకు మంచి పోషకాలు అందుతాయి.
Also read: iPhone Factory Reset: ఐఫోన్ ను రీసెట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ సులభమైన టిప్స్ తెలుసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook