Lemon And Salt Benefits For Skin: చర్మ సౌందర్యాన్ని పెంచడానికి నిమ్మకాయ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్మకాయలో విటమిన్ సి అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి చర్మానికి సంబంధించిన సమస్యలను సులభంగా దూరం చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉండే బ్లీడింగ్ గుణాలు ముఖంపై మచ్చలను తొలగించేందుకు సహాయపడుతుంది. అయితే నిమ్మలో ఉప్పును కలిపి ఫేస్‌కు అప్లై చేయడం వల్ల సులభంగా చనిపోయిన కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అయితే నిమ్మకాయ, ఉప్పును కలిపి అప్లై చేయడం వల్ల కూడా కొన్ని రకాల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిమ్మ, ఉప్పును ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:


డెడ్ స్కిన్‌పై ప్రభావం:
నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయడం వల్ల చర్మంలోని మృతకణాలను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. నిమ్మకాయలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీ ఏజింగ్ గుణాలు చర్మాన్ని లోతు నుంచి శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. గ్లో తీసుకురావడానికి కీలక పాత్ర పోషిస్తాయి.


చర్మంపై నూనె:
నిమ్మ, ఉప్పును ముఖంపై అప్లై చేయడం వల్ల ఆయిల్‌ స్కిన్‌ తొలగిపోతుంది. ముఖ్యంగా మొటిమలు వంటి సమస్యలు సులభంగా దూరమవుతాయి. కాబట్టి జిడ్డుగల ముఖంతో ఇబ్బంది పడే వారు క్రమం తప్పకుండా  నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి.


ముడతలు, ఫైన్ లైన్ వదిలించుకోండి:
నిమ్మ, ఉప్పు మిశ్రమం ముఖంపై చర్మాన్ని మెరిపించేందుకు సహాయపడుతుంది. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముడతలు, ఫైన్ లైన్ సమస్యలు సులభంగా తగ్గుతాయి. ఇందులో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు చర్మం ముడతలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.


ముఖానికి ఇలా అప్లై చేయండి:
నిమ్మ, ఉప్పును ముఖానికి అప్లై చేయడానికి ముందుగా దీనిని ఇలా తయారు చేసుకోండి. మొదటగా రెండు చెంచాల నిమ్మరసం తీసుకుని అందులో ఒక చిన్న చెంచా ఉప్పును ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఆ తర్వాత దీనిని మూఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకోండి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read : Komati Reddy Venkat Reddy: కోమటి రెడ్డి ఆడియో లీక్.. మునుగోడులో కలకలం


Also Read : Dasoju Sravan: మునుగోడు ఉపఎన్నిక వేళ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ గూటికి దాసోజు శ్రవణ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook