Tea For A Healthy Heart: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండె పోటు, గుండె వైఫల్యం వంటి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఆరోగ్యనిపుణులు ప్రకారం ఇరువై ఏళ్లు నుంచి ఆరువై ఏళ్లు ఉన్నవారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి గుండె సమరక్షణపైన ప్రత్యేక శ్రద్ధ వహించడం ఎంతో ముఖ్యం. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఉదయం పూట చాలా మంది బ్రేక్‌ ఫాస్ట్‌ తరువాత టీ, కాఫీ తీసుకోనే అలవాట్లు ఉంటుంది. సాధారణ టీ కంటే కొన్ని ఆరోగ్యకరమైన టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ లెమన్‌  గ్రాస్‌ టీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  దీనిని ప్రతిరోజు మీ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు మీ దరి చేరకుండా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు . 


లెమన్‌ గ్రాస్‌ టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు: 


లెమన్‌ గ్రాస్‌ టీ ఒక రుచికరమైన , ఆరోగ్యకరమైన పానీయం, ఇది శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగించబడుతోంది. ఇందులో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.


కొన్ని ముఖ్య ప్రయోజనాలు:


లెమన్ గ్రాస్‌ టీలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఈ నష్టాన్ని నివారించడంలో సహాయపడతాయి. అలాగే జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది అజీర్ణం, వాంతులు, విరేచనాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ లెమన్‌ గ్రాస్‌ టీలోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో జలుబు, ఫ్లూ ఇతర ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటంలో సహాయపడతాయి. లెమన్‌ గ్రాస్‌ టీకి వాపును తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి వంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ టీని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది నిద్రను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.


ఈ టీ తయారు చేయడం ఏంతో సులభం. దీని కోసం మీరు ఇంట్లో ఉపయోగించే పదార్థాలు ఉంటే సరిపోతుంది. అయితే ఈ ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.  


లెమన్ గ్రాస్ టీ ఎలా తయారు చేయాలి:


లెమన్‌ గ్రాస్‌ టీ  తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు నీటిలో ఒక లేదా రెండు తాజా లేదా ఎండిన నిమ్మగడ్డి కాండాలను వేసి 5-10 నిమిషాలు మరిగించాలి. తరువాత వడకట్టి తేనె లేదా నిమ్మరసం కలిపి రుచికి తగినట్లుగా తాగండి.


గమనిక:


గర్భవతి లేదా పాలిచ్చే మహిళలు లెమన్‌ గ్రాస్‌ టీని తీసుకోవడానికి ముందు వైద్యుడిని సంప్రదించాలి.


కొంతమందిలో ఈ టీ అలెర్జీ ప్రతిచర్యలను కలిగిస్తుంది. ఏవైనా దుష్ప్రభావాలు ఉంటే, వెంటనే దానిని తాగడం మానేయండి.


లెమన్ గ్రాస్‌ టీ రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. ఇది మీ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి