Lemongrass Tea Benefits: లెమన్ గ్రాస్ హెర్బల్ టీతో శరీరానికి బోలెడు లాభాలు..ఈ దీర్ఘకాలిక వ్యాధున్నీ మాయం..
Lemongrass Tea Benefits: ప్రస్తుతం చాలా మంది గ్రీన్ టీను తాగుతూ ఉంటారు. వాటికి బదులుగా లెమన్ గ్రాస్‌తో తయారు చేసిన టీని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారు.
Lemongrass Tea Benefits: వాన కాలం ముగిసి త్వరలోనే చలి కాలం ప్రారంభం కాబోతోంది. అయితే ఈ సమయంలో చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉంటాయి. ముఖ్యంగా శరీరంలోని రోగనిరోధక శక్తి తగ్గింపోవడం వల్ల ఈ సమయంలో అనేక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశాలు ఉండొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో తప్పకుండా రోగనిరోధక శక్తిని పెంపొందించే పలు రకాల డ్రింక్స్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.
శరీరంలోని రోగనిరోధక శక్తి పెరగడానికి లెమన్ గ్రాస్ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ, సి, ఫోలేట్, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఈ లెమన్ గ్రాస్‌లో జింక్, కాపర్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం అధిక మోతాదులో లభిస్తాయి. కాబట్టి దీనితో తయారు చేసిన టీని ప్రతి రోజు తీసుకుంటే శరీరం నిర్విషీకరణ అవుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ గుణాలు కూడా అధిక మోతాదుల్లో లభిస్తాయి. కాబట్టి ఈ లెమన్ గ్రాస్ హెర్బల్ టీని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ హెర్బల్ టీని ప్రతి రోజు తాగే వారిలో క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
హెర్బల్ టీ తయారీ తయారికి కావాల్సిన పదార్థాలు:
✾ లెమన్ గ్రాస్
✾ నిమ్మకాయ
✾ అల్లం
✾ ఏలకులు
✾ తులసి
✾ లవంగం
✾ తేనె
హెర్బల్ టీ తయారీ పద్ధతి:
ఈ టీని తయారు చేయడానికి ముందుగా పాన్‌ని తీసుకోవాల్సి ఉంటుంది.
అందులోనే 2 గ్లాసుల నీటిని వేసుకుని బాగా వేడి చేసుకోవాలి.
ఇందులోనే లెమన్ గ్రాస్‌ను వేసి బాగా మరిగించుకోవాలి.
ఇలా 15 నిమిషాల పాటు మరిగిన తర్వాత ఈ టీ లేత బంగారు రంగులోకి వస్తుంది.
ఆ తర్వాత వడకట్టుకుని తేనెను మిక్స్ చేసుకుని తాగితే చాలు.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి