Geysers Usage: గీజర్ ను ఆన్ లో పెట్టేసి స్నానం చేస్తున్నారా...?.. మీరు ఈ రిస్క్ లో పడ్డట్లే..
Life style: కొందరు గీజర్ ను గంటల తరబడి ఆన్ లో ఉంచేస్తుంటారు. దీంతో గీజర్ లోని కాయిల్ ఒత్తిడికి గురౌతుంది.
Using Geysers: సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రస్తుతం గీజర్ ఉండటం కామన్ అయిపోయింది. వింటర్ సీజన్ లో గీజర్ లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఉదయం పూట, మరల ఆఫీసుల నుంచ వచ్చాక గీజర్ లను పెట్టుకుని మరీ స్నానం చేస్తుంటారు. కొందరు మాత్రం గీజర్ ను ఆన్ చేసి వేరే పనులు చేస్తుంటారు. గంటల తరబడి గీజర్ ఆన్ లో ఉందన్న ధ్యాసకూడా అస్సలు ఉండదు. ఇంకొందరు మాత్రం.. గీజర్ లను ఆన్ లో పెట్టి మరీ స్నానం చేస్తుంటారు.
ఈ తప్పులు అస్సలు చేయోద్దు..
గీజర్ లను ఆన్ లో పెట్టి స్నానం చేస్తే కాయిల్ ఒత్తిడికి గురౌతుంది. దీంతో గీజర్ పగిలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. గీజర్ లపైన ఎలాంటి వస్తువులు కూడా పెట్టకూడదు. గీజర్ లను టెక్నిషియన్ తో ఎప్పటికప్పుడు చెక్ చేయిస్తు ఉండాలి.
స్నానంచేసే పదినిముషాల ముందు మాత్రమే గీజర్ లను ఆన్ చేయాలి. ఆ తర్వాత మరల ఆఫ్ చేసి స్నానంకు వెళ్లాలి. గీజర్ లో సరైన విధంగా ఉష్ణోగ్రతలు ఉండేలా చూసుకొవాలి. వైరింగ్ కూడా సరిగ్గా ఉండేలా చూసుకొవాలి. కొన్నిసార్లు షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook