How To Use Camphor: హిందూ మతంలో కర్పూరాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. దీనిని ఎక్కువగా దేవుడికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. పూజలో ఉపయోగించే ఈ కర్పూరాన్ని ఔషధంగా కూడా వాడతారు. రెండు రూపాయలకే లభించే ఈ కర్పూరంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా దీనిని ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వాడతారు. అంతేకాకుండా దీని సువాసన పరిమళం మనుసుకు సాంత్వన చేకూరుస్తుంది. దీని యెుక్క ఇతర బెనిఫిట్స్ ఏంటో ఓసారి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్పూరం యెుక్క ఇతర ప్రయోజనాలు
** రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కర్పూరం నూనె అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చర్మంపై వచ్చే వాపు, మొటిమలు మరియు జిడ్డును కూడా తొలగిస్తుంది. 
** ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం పొందడానికి కర్పూరం మిశ్రమాన్ని లేపనంగా వాడతారు. 
** కర్పూరంతో కూడిన బామ్‌ను రాస్తే మెడనొప్పి క్షణాల్లో ఎగురుపోతుంది. 
** శొంఠి, అర్జున బెరడు, తెల్ల చందనంతో కలిపి కర్పూరం రాసుకుంటే తలనొప్పి దూరమవుతుంది.
** వేడి నీటిలో కర్పూరం వేసి ఆవిరి పట్టడం వల్ల జలుబు తగ్గుతుంది.
** ప్రస్తుత రోజుల్లో జట్టు ఊడిపోతుంది.ఈ సమస్యకు కర్పూరంతో చెక్ పెట్టొచ్చు. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడే వారు కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.
** ఇది జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.


Also Read: Papaya Benefits: బొప్పాయితో బోలెడు ప్రయోజనాలు.. తెలిస్తే తినకుండా ఉండలేరు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook