Lifestyle Changes: మీ లైఫ్‌స్టైల్ ఈ మార్పులు చేస్తే..30 రోజుల్లో థైరాయిడ్ సమస్య మాయం
Lifestyle Changes: ఇటీవలి కాలంలో థైరాయిడ్ ప్రధాన సమస్యగా మారింది. అయితే జీవనశైలిలో కొన్ని స్వల్పమైన మార్పులతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆధునిక జీవితంలో ఎదురౌతున్న లైఫ్‌స్టైల్ వ్యాధులు డయాబెటిస్, అధిక రక్తపోటుతో పాటు థైరాయిడ్ సమస్య కూడా ముఖ్యమైంది. ఈ ఒక్క సమస్య శరీరంలో పలు ఇతర సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలి.
ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్య అధికమౌతోంది. థైరాయిడ్ అనేది ఓ గ్రంథి. ఈ గ్రంథిలో సమస్య ఉంటే హార్మోన్ ఉత్పత్తి అధికమౌతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే శరీరం బరువు వేగంగా పెరుగుతుంది. మరోవైపు శరీరపు జీవక్రియ ప్రభావితమౌతుంది. చాలామంది థైరాయిడ్ సమస్యకు మందులు వాడుతుంటారు. కానీ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు మందుల కంటే జీవనశైలిలో మార్పులు చేస్తే మంచి ఫలితాలుంటాయి. లైఫ్‌స్టైల్‌లో ఎలాంటి మార్పులు చేయాలో తెలుసుకుందాం.
ఎక్సర్‌సైజ్
శరీరానికి ఎక్సర్‌సైజ్ అనేది చాలా ముఖ్యం. ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది. మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. థైరాయిడ్ సమస్యకు ప్రతిరోజూ వ్యాయామం తప్పకుండా చేయాలి. దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ పనితీరు మెరుగౌతుంది. బరువు తగ్గేందుకు దోహదమౌతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్
థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు డైట్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌లో సోయాబీన్స్, గుడ్లు, వాల్‌నట్స్, చేపలు వంటివి తప్పకుండా తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
కెఫీన్ తగ్గించడం
కెఫీన్ శరీరానికి హాని కల్గించే పదార్ధం. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కెఫీన్ నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్ శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను పెంచుతుంది. డీహైడ్రేషన్ ఆరోగ్యానికి హాని కల్గిస్తుంది.
ఆ కూరగాయలకు దూరం
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు బ్రోకలీ, కాలిఫ్లవర్, క్యాబేజ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఈ కూరగాయలు శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పాదనను తగ్గించేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook