Health benefits of Avocado: ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో అవకాడో ఒకటి. ఈ అవకాడోను బట్టర్ ప్రూట్ అని కూడా పిలుస్తారు. దీనిగా పండుగా కంటే కూడా కూరగాయలానే వివిధ వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తారు. ఇవి ఎక్కువగా సూపర్  మార్కెట్‌లలోనే దొరుకుతాయి. ఈ పండులో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో బీ విటమిన్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధులు దూరమవుతాయి. అవకాడో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అవకాడో ప్రయోజనాలు
**అవకాడోలో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వైట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ పండు తినడం మంచిది. 
**డయాబెటిక్ రోగులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఈ పండు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ లో ఉంటాయి. 
**ఈ ఫ్రూట్ లో విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
**అవకాడోలో పైబర్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ప్రేగులు ఆరోగ్యంగా ఉంటాయి. 
**అవకాడో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి శరీరంలో నొప్పులు, వాపును తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. 
**అవోకాడోలో  ఫోలేట్, పొటాషియం వంటి మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా తల్లి పాల ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. 
**అవకాడోలు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.  అంతేకాకుండా ఇది కళ్లకు కూడా ఎంతో మేలు చేస్తు్ంది. ఊబకాయం రాకుండా చూస్తుంది. 


Also Read: Green Tea For Face Wash: గ్రీన్ టీ వాటర్‌ ఫేస్‌ వాష్‌తో చర్మానికి బోలెడు లాభాలు, తప్పక తెలుసుకోవాల్సిందే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook