Green Tea For Face Wash: ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉన్నవారు పాలతో తయారు చేసిన టీలను మానుకుని గ్రీన్ టీని తాగడం ప్రారంభిస్తారు. ఎందుకంటే గ్రీన్ టీలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇది శరీరానికే కాకుండా ముఖ సౌందర్యాన్ని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. గ్రీన్ టీ చర్మానికి ఎలా వినియోగించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్రీన్ టీ వాటర్‌తో ముఖం శుభ్రం చేయడం వల్ల కలిగే లాభాలు:
✽ గ్రీన్ టీతో ముఖం శుభ్రం చేసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చర్మంపై టానింగ్ సమస్యలను తగ్గించేందుకు కీలక సహాయపడతాయి. అంతేకాకుండా యూవీ కిరణాలను వల్ల చర్మం దెబ్బతినకుండా గ్రీన్ టీ కీలక దోహదపడుతుంది. తరచుగా టానింగ్ సమస్యలతో బాధపడేవారు సులభంగా ఉపశమనం పొందడానికి ప్రతి రోజు గ్రీన్ టీతో ముఖం శుభ్రం చేసుకోవాలి.
✽ తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ ముఖానికి వినియోగించాల్సి ఉంటుంది. దీనిని ఉపయోగించడం వల్ల ముఖం నుంచి వచ్చే అదనపు నూనె తొలగిపోతుంది. అంతేకాకుండా సులభంగా మొటిమలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
✽ గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇది మీ వృద్ధాప్య చర్మాన్ని నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా చర్మంపై పగుళ్లు, ముడతల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
✽ వేసవి నుంచి వానా కాలం రాగానే చర్మంపై గ్లో సులభంగా తగ్గుతుంది. దీని కారణంగా డెడ్ స్కిన్ లేయర్ పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇదే క్రమంలో నల్ల మచ్చలు వచ్చే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. మీ ముఖాన్ని గ్రీన్ టీ నీటితో శుభ్రం చేసుకుంటే చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీని కారణంగా అన్ని రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
✽ తరచుగా చర్మంపై వాపు, చికాకు వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా గ్రీన్ టీ సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. ఈ టీని చర్మానికి వినియోగించడం వల్ల దురద అలెర్జీ, ఎరుపు సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
గ్రీన్ టీ ఏ సమయంలో ఉపయోగించాలో తెలుసా?:
ఉదయం నిద్రలేచిన వెంటనే గ్రీన్ టీ నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాత్రి పడుకునే ముందు కూడా ముఖాన్ని క్లిన్ చేసుకుంటే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర చర్మ సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook