Benefits Of Green Tamato: కూర రుచికరంగా ఉండాలంటే టమాటాలు ఉండాల్సిందే. సాధారణంగా కర్రీ తయారీకి రెడ్ టమాటాలను వాడతాం. మనం ఎర్ర టమాటా వల్లే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని అనుకుంటాం. కానీ పచ్చి టమాటాల (Green Tamato) వల్ల కూడా బోలెడు లాభాలు ఉన్నాయని మీకు తెలుసా. గ్రీన్ టమాటాలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పచ్చి టమాటాలో విటమిన్ ఎ, విటమిన్ సితోపాటు కాల్షియం, పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. టమోటాలలో ఫైటోకెమికల్స్‌ అధికంగా ఉంటాయి. పచ్చి టమాటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పచ్చి టమాటా తినడం వల్ల లాభాలు
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
పచ్చి టమాటాలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటారు. 
ఎముకలకు బలం
పచ్చి టమాటాల్లో విటమిన్ కె, కాల్షియం, లైకోఫీన్ ఉంటాయి. గ్రీన్ టమాటాలు తినడం వల్ల మీ ఎముకలు గట్టిపడతాయి. 
కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి
గ్రీన్ టమాటాల్లో  బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. దీనిని రెగ్యూలర్ గా మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మీ కంటిచూపు మెరుగుపడుతుంది.  
స్కిన్, జుట్టుకు మంచిది
గ్రీన్ టమాటాల్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది చర్మానికి నిగారింపు ఇవ్వటంతోపాటు మీ జట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుంది. 


Also Read: Eye Flu During Monsoon Season: వానా కాలంలో ఐ ఫ్లూ రావడానికి కారణాలు, లక్షణాలు, ఉపశమనం చిట్కాలు


హైబీపీని కంట్రోల్ చేస్తుంది
సరైన జీవనశైలి అలవరచుకోకపోవడం, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీకు అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. పచ్చి టమాటాల్లో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది హైబీపీని కంట్రోల్ చేస్తుంది. 
క్యాన్సర్ కు చెక్
పచ్చి టమాటాలు యాంటీయాక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్ ను నివారించడంలో సహాయపడుతుంది. 


(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Diabetes: మధుమేహాన్ని తగ్గించే అద్భుతమైన పొడి ఇదే..రోజు ఒక టీ స్పూన్ తీసుకుంటే చాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook