Lychee Peel Benefits: ప్రస్తుతం భారత్‌ చాలా రకాలు పండ్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా వేసవిలో శరీరాన్ని హైడ్రెట్‌గా ఉంచడానికి లిచీ లాంటి పండ్లను మార్కెట్‌లో చాలా విక్రయిస్తున్నారు. ఈ పండ్లను ఎక్కువగా బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో పండిస్తున్నారు. కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఈ పండ్ల వినియోగం తక్కువగా ఉంది.  అయితే లిచీ పండును తిన్న తర్వాత, దాని తొక్కను పక్కన పడేస్తున్నారు. కానీ ఈ తొక్క ద్వారా శరీరానికి చాలా లాభాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ తొక్క  తినడం ద్వారా శరీరానికి వచ్చే  ప్రయోజనాలను తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లిచీలో ఉండే పోషకాలు:


లీచీలో విటమిన్ సి, ఫోలేట్, నియాసిన్, రిబోఫ్లావిన్, బీటా కెరోటిన్, ఫోలేట్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మానవ శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది.



లిచీ తినడం వల్ల కలిగే 5 ప్రయోజనాలు


1. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది
2. ఊబకాయం తగ్గుతుంది
3. జీర్ణక్రియ మెరుగు పడుతుంది
4. గొంతు నొప్పిని తగ్గిస్తుంది
5. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనాలు


 లిచీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తప్పక తెలుసుకోవాలి..ఈ తొక్క ద్వారా వచ్చే ప్రయోజనాలను తెలిస్తే ఆశ్చర్య పోతారు.


లిచీ పీల్స్ ప్రయోజనాలు:


-లీచీ తోక్కలను ఫేస్ స్క్రబ్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీనికోసం బియ్యప్పిండి, అలోవెరా జెల్, రోజ్ వాటర్‌ను మిక్సీ గ్రైండర్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మసాజ్ చేయండి. 10 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగండి. ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది.


-మెడ మీద పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. దీనికోసం తొక్కను మెత్తగా నిమ్మరసం, కొబ్బరి నూనె, పసుపు కలిపి పేస్ట్ సిద్ధం చేయండి.


-చీలమండల మురికిని శుభ్రం చేయడానికి లిచీ పీల్ చాలా సహాయపడుతుంది. దీని కోసం తొక్కను ముతకగా రుబ్బుకోవాలి..ఆ తర్వాత ముల్తానీ మిట్టి, ఆపిల్ వెనిగర్, బేకింగ్ సోడా అందులో కలపండి. దీన్ని చీలమండలపై అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Summer Drinks: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జ్యూస్‌లు, వీటిని తయారుచేసుకోవడం చాలా ఈజీ..!


Also Read: Watermelon: పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టుకుని తింటున్నారా..ఈ దుష్ప్రభావాలు తప్పవు..!!


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.