Maggi Upma Recipe: మ్యాగీ ఉప్మా రెసిపీ ఇలా 5 నిమిషాల్లో రెడీ చేస్కోండి!
Maggi Upma Recipe: మ్యాగీ ప్రతి రోజు తినడం వల్ల చాలా బోర్ కొడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసం ప్రత్యేకమైన మ్యాగీ ఉప్మా రెసిపీని తీసుకువచ్చాం. అయితే దీనిని ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Maggi Upma Recipe In Telugu: మ్యాగీ అంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే చాలా మంది మ్యాగీని ఒకే రకంగా వండుకుని తినడం వల్ల బోర్ కొడుతూ ఉంటుంది. అలాగే తినాలని కూడా అనిపించదు. ఇలాంటి వారి కోసం ప్రత్యేకమైన రెసిపీని తీసుకువచ్చాం. మ్యాగీతో ఉప్మా రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లలకు కూడా ఎంతో బాగా నచ్చుతుంది. అలాగే మ్యాగీతో పాటు సూజీ వినియోగించి తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అంతేకాకుండా ఇందులో పచ్చి కూరగాయలను వేసి తీసుకోవడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయి. అయితే ఈ మ్యాగీ ఉప్మా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దీని కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మ్యాగీ ఉప్మా రెసిపీ కావాల్సిన పదార్థాలు:
1 ప్యాకెట్ మ్యాగీ నూడుల్స్
1/2 కప్పు సూజీ (రవ్వ)
1/4 కప్పు కూరగాయలు (ఉల్లిపాయ, క్యారెట్, బఠానీలు)
1 టేబుల్ స్పూన్ నూనె
1/2 టీస్పూన్ ఆవాలు
1/2 టీస్పూన్ జీలకర్ర
1/2 టీస్పూన్ ఎండు కరివేపాకు
1/2 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ కారం
1/4 టీస్పూన్ గరం మసాలా
ఉప్పు రుచికి సరిపడా
2 కప్పుల నీరు
కొత్తిమీర తగినంత
తయారీ విధానం:
ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో మ్యాగీ నూడుల్స్ వేసుకుని నీటిలో నానబెట్టుకోండి.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
వాటి తరువాత కరివేపాకు, ఉల్లిపాయ, క్యారెట్, బఠానీలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇందులోనే సూజీ వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఉప్పు, నీరు వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
నీరు మరిగిన తర్వాత నానబెట్టిన మ్యాగీ నూడుల్స్‌ను నీటి నుంచి తీసి, పాన్ లో వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఉప్మాను నీరు ఆవిరైపోయే వరకు ఉడికించాల్సి ఉంటుంది.
కొత్తిమీరతో అలంకరించి వేడిగా వేడిగా వడ్డించుకోండి
చిట్కాలు:
ఇందులో కావాలనుకుంటే ఆకు కూరాలతో తయారు చేసిన మిశ్రమాలను కూడా వేసుకోవచ్చు.
ఉప్మా మరింత రుచిగా తయారు చేసుకోవడానికి నూనెకు బదులుగా నెయ్యిని కూడా వినియోగించవచ్చు.
ఉప్మా మరింత రుచిగా ఉండడానికి నిమ్మరసం లేదా పెరుగుతో కూడా వడ్డించవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి