Vitamin E Oil Benefits: పిగ్మంటేషన్ సహా చర్మ సమస్యలన్నింటినీ మాయం చేసే అద్భుతమైన ఫేస్‌క్రీమ్
Vitamin E Oil Benefits: విటమిన్ ఇ ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. విటమిన్ ఇ ఆయిల్‌లో ఉండే పోషక పదార్ధాలతో చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పిగ్మంటేషన్ సమస్య ఇట్టే దూరమౌతుంది.
చలికాలం వస్తూనే చర్మం డ్రైగా మారిపోతుంటుంది. ఫలితంగా చర్మంపై దురద, రెడ్డిష్‌నెస్ సమస్య అధికమౌతుంది. అందుకే చలికాలంలో చర్మానికి డీప్ నరిష్మెంట్ చాలా అవసరం. అదెలాగో చూద్దాం..
చలికాలంలో ఎదురయ్యే ఈ సమస్యల్నించి ఉపశమనం పొందేందుకు విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ కీలకంగా ఉపయోగపడుతుంది. విటమిన్ ఇ ఆయిల్‌లో ఉండే పోషకాలతో చర్మానికి చాలా ఉపయోగాలున్నాయి. విటమిన్ ఇ ఆయిల్ తీసుకోవడం వల్ల చర్మానికి అంతర్గత పోషకాలు లభిస్తాయి. ఫలితంగా చర్మం మృదువుగా, మెత్తగా మారుతుంది.
మరోవైపు విటమిన్ ఇ ఆయిల్ చర్మంపై ముడతలు, హైపర్ పిగ్మంటేషన్ సమస్యను తొలగిస్తుంది. అంతేకాకుండా విటమిన్ ఇ చర్మాన్ని రెజ్యువనేట్ చేయడంలో దోహదపడుతుంది. విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ ఎలా చేయాలంటే..
How to make vitamin E face cream
విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ ఎలా చేయాలంటే
3 లార్జ్ స్పూన్స్ కోకో బటర్, 4 లార్జ్ స్పూన్స్ వర్జిన్ కొబ్బరి నూనె, 1 స్మాల్ స్పూన్ విటమిన్ ఇ ఆయిల్, 3-4 డ్రాప్స్ ల్యావెండర్ ఎస్సేన్షియల్ ఆయిల్ అవసరమౌతాయి.
ముందుగా కోకో బటర్, వర్జిన్ కొబ్బరి నూనె ఆయిల్ తీసుకుని.. బాయిలర్‌లో వేసి బాగా మరగబెట్టి కలపాలి.ఆ తరువాత స్టౌవ్ ఆపేయాలి. కాస్సేపు చల్లారనివ్వాలి. ఆ తరువాత ఇందులో ల్యావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, విటమిన్ ఇ ఆయిల్ వేసి కలపాలి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో వేసి ప్లాస్టిక్ ర్యాప్‌తో చుట్టాలి. దాదాపు 30 నిమిషాల వరకూ ఫ్రిజ్‌లో ఉంచాలి. ఆ తరువాత గ్లాస్ కంటెయినర్‌లో వేసి స్టోర్ చేసుకోవాలి. విటమిన్ ఇ ఫేస్‌క్రీమ్ తయారైనట్టే.
Also read: Health Tips: ఈ నాలుగు రకాల టీలు తాగితే చాలు..డయాబెటిస్, కొలెస్ట్రాల్ పూర్తిగా అదుపులో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook