Flaxseed and Aloevera Gel: జుట్టు సంరక్షణలో కలబంద కీలకపాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్ ఏ, సీ, ఇ ఉంటాయి. ఇది జుట్టు ఆరోగ్యానికి పోషణనిస్తుంది కుదుళ్ల నుంచి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. తరచూ కలబందను జుట్టుకు పెట్టుకోవడం వల్ల మీ జుట్టు మెత్తగా పట్టులా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. కలంబందను కొల్లాజెన్ ఉత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తుంది ఇది జుట్టు పెరుగుదను ప్రేరేపిస్తుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుదళ్ల నుంచి మాయిశ్చర్ నిలిపి డ్యాండ్రఫ్‌ సమస్యకు చెక్ పెడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీంతో తల దురద ఉండదు. అంతేకాదు కలబంద మంచి నేచురల్ కండీషనర్ జుట్టు సిల్కీ స్మత్‌ గా మారుతుంది. జుట్టు కూడా ఆరోగ్యంగా మెరుస్తుంది.  కంలబందలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. కుదళ్లు ఇన్పెక్షన్ నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాదు కలబందలోని సూర్యూని హానికర యూవీ కిరణాల నుంచి కాపాడుతుంది. జట్టు స్ప్లిట్స్‌ రాకుండా నివారిస్తుంది.


అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను పారదోలడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఆరోగ్యపంగా మాత్రమే కాదు సౌందర్యపరంగా కూడా అవిసెగింజలు ఎంతో ఉపయోగకరం. దీంతో ఫేస్‌ ప్యాక్, హెయిర్ మాస్క్‌లు కూడా వేసుకుంటారు. ముఖం వేలాడకుండా ఉండాలంటే ఈ ప్యాక్ వేసుకుంటారు. అంతేకాదు జుట్టు మందంగా, పొడుగ్గా ఉండాలంటే కూడా అవిసెగంజల మాస్క్‌ తయారు చేసుకుని వేసుకుంటారు. వీటిని ఆహారంలో కూడా తీసుకుంటే కూడా మరీ మంచిది.  ఈరోజు మనం కలబంద, అవిసె గింజలను ఉపయోగించి హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో తెలుకుందాం.


ఇదీ చదవండి: 


కలబంద, ఫ్లాక్స్‌సీడ్ మాస్క్..
ఫ్లాక్స్ సీడ్‌- 1 TBSP
నీళ్లు - కప్పు
కలబంద జెల్‌ 3 TBSP
కొబ్బరినూనె -3 చుక్కలు


ఇదీ చదవండి: ప్రతిరోజూ అరటిపండు తింటే మీ శరీరంలో ఏ మార్పు జరుగతుందో తెలుసా?  


తయారీ విధానం..
కలబంద, అవిసెగింజల మాస్క్ తయారీకి ఒక గిన్నె స్టవ్ పై పెట్టండి. అందులో అవిసె గింజలు వేసి మీడియం హీట్‌లో ఉడికించుకోండి.  ఇప్పుడు వీటిని కలుపుతూ ఉండాలి. ఇది గంజి మాదిరి మారుతుంది. ఇది జెల్ మాదిరి మారిన వెంటనే స్టవ్ ఆప్‌ చేసి ఓ గంటపాటు చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులో కలబంద వేసి బాగా కలపాలి. ఓ కాటన్ క్లాత్‌లో వేసుకుని ఓ గిన్నెలో పిండుకోవాలి. కొబ్బరి నూనె కూడా కలుపుకోవాలి.


ఇదీ చదవండి: మహిళలు అత్యధికంగా జీతాలు సంపాదిస్తున్న ఉద్యోగాలు ఇవే..   


జుట్టు మొత్తం ఈ జెల్ ను అప్లై చేయాలి. మీ వేళ్లతో మెల్లిగా మర్దన చేయాలి. మీ జుట్టు మొత్తం ఈ జెల్ ను అప్లై చేయాలి. ఈ మాస్క్‌ తో జుట్టు కుదుళ్ల నుంచి రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇప్పుడు ఓ టవల్‌ను వేడి నీళ్లలో తడిపి హెయిర్ ప్యాక్ చేసుకోవాలి. దీన్ని ఓ 30 నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ మాస్క్ వారానికి ఓసారి వేసుకోవాలి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter