Highest Paying Jobs For Women: మహిళలు అత్యధికంగా జీతాలు సంపాదిస్తున్న ఉద్యోగాలు ఇవే..

Highest Paying Jobs For Women: మహిళలకు కూడా ఈరోజుల్లో తమ కాళ్లపై తాము నిలబడటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సాధిస్తున్నారు కూడా.

Highest Paying Jobs For Women: మహిళలకు కూడా ఈరోజుల్లో తమ కాళ్లపై తాము నిలబడటానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు సాధిస్తున్నారు కూడా. ప్రపంచంలో అన్ని విభాగాల్లో పురుషులకు పోటీగా మహిళలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, కొన్ని ఉద్యోగాల్లో మహిళలు ఎక్కువగా జీతాలు పొందుతున్నారట. ఆ విభాగాలు ఏంటో తెలుసుకుందాం.
 

1 /7

హెల్త్‌ కేర్.. మనందరికీ తెలిసిన విషయమే హెల్త్‌ కేర్ రంగం దినదినాభివృద్ధి చెందుతుంది. అయితే, ఈ రంగంలో మహిళలు ఎక్కువగా జీతాలు పొందుతున్నారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్‌ కేర్‌ ఎగ్జిక్యూటీవ్ విభాగాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారట. ఈ విభాగంలో వారు ఎక్కువ మొత్తంలో జీతాలు పొందుతున్నారట.

2 /7

ఫార్మా.. ఫార్మా, బయోటెక్నాలజీలో పనిచేస్తున్న మహిళలకు కూడా ఎక్కువ జీతం తీసుకుంటున్నారు. రీసెర్చ్, డెవలప్మెంట్ స్థాయిలో క్లినికల్ ట్రయల్స్, రెగ్యలేటరీ విభాగంలో మంచి జీతాన్ని పొందుతున్నారట.

3 /7

టెక్నాలజీ.. ఆ తర్వాతి స్థానం టెక్నాలజీలో మహిళలకు ఎక్కువ జీతం లభిస్తున్న మరో రంగం. సాప్ట్‌వేర్ ఇంజినీర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ విభాగంలో మహిళలు ఎక్కువ జీతాలు పొందుతున్నారట. ఈ రంగంలో మగవారికి పోటీగా తమ ప్రతిభను కనబరుస్తూ అధిక జీతాలు పొందే స్థానంలో ఉన్నారట.

4 /7

లా.. న్యాయ రంగానికి చెందిన కొన్ని ప్రత్యేక విభాగాల్లో మహిళలకు ఎక్కువ జీతాలు అందుతున్నాయి. కార్పొరేట్‌ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా, ఇంటర్నెషనల్ లా ఈ విభాగాల్లో అటర్నీ స్థాయిలో ఉన్నవారికి మంచి జీతాలు అందిపుచ్చుకుంటున్నారు.

5 /7

ఇంజినీరింగ్.. ఇంతకు ముందు ఈ రంగంలో కేవలం మగవారే అత్యధికంగా కనిపించేవారు. కెమికల్ ఇంజినీర్, పెట్రోలియం ఇంజినీర్, ఎలక్ట్రిక్ ఇంజినీర్ వంటి ఎక్కువ జీతాలు పొందే ఉద్యోగాలు. ప్రస్తుతం నారీమణులు కూడా ఈ విభాగాల్లో దూసుకుపోతున్నారట.

6 /7

కన్సల్టెన్సీ.. మేనెజ్మెంట్‌ కన్సల్టెన్సీ ఫార్మ్‌ ఎక్కువగా జీతాలు అందిస్తాయి. ప్రత్యేకంగా ఈ విభాగంలో అనుభవం కలిగిన  మహిళలకు ఇది మంచి రంగం.

7 /7

ఫైనాన్స్.. ఫైనాన్స్, పెట్టుబడి రంగాల్లో కూడా మహిళలకు ఎక్కువ జీతాలు లభిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఫైనాన్షియల అనలిస్ట్‌, అస్సెట్‌ మేనెజ్మెంట్‌ మంచి నైపుణ్యత, అనుభవం కలిగిన మహిళామణులకు మంచి జీతాలు ఇస్తున్నాయట.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )