Sri Rama Navami 2024: శ్రీ రాముడికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోర రెసిపీ.. ఇలా సులభంగా తయారు చేసుకోండి..
Sri Rama Navami 2024 Special Mamidikaya Pulihora: చాలామంది శ్రీరామనవమి రోజున సీతారాములకి పానకం తో పాటు నైవేద్యంగా మామిడికాయ పులిహోర పెడుతూ ఉంటారు. అయితే ఈ ఏడాది మీరు కూడా శ్రీరాముడికి మామిడికాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? ఈ రెసిపీని ఇలా సులభంగా తయారు చేసుకోండి.
Sri Rama Navami 2024 Special Mamidikaya Pulihora: పూర్వకాలంలో అయోధ్య పట్టణంలో శ్రీరాముడు చైత్రమాసంలోని శుక్లపక్షమి 9వ రోజున జన్మించాడు. ఆయన జన్మదినం రోజునే శ్రీరామనవమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈరోజు రామ భక్తులంతా భక్తిశ్రద్ధలతో సీతారాములను పూజించి, ఉపవాసాలు చేస్తారు. చాలామంది ఈరోజు పూజలో భాగంగా శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన మామిడికాయ పులిహోరను నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, రామాలయాల్లో సీతారాముల కళ్యాణం తర్వాత ప్రసాదంగా మామిడికాయ పులిహోరనే పెడుతూ ఉంటారు. శ్రీరాముడికి ప్రసాదంగా తయారు చేసే మామిడికాయ పులిహోరను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తయారు చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మామిడికాయ మిశ్రమంతో పాటు పులిహోరకు మంచి రుచి అందించేందుకు నిమ్మరసాన్ని కూడా వినియోగిస్తారు. అయితే మీరు కూడా ఈ సంవత్సరం శ్రీరాముడికి మామిడికాయ పులిహోర నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నారా? అయితే సులభంగా ఇలా తయారు చేసుకోండి.
మామిడికాయ పులిహోర రెసిపీకి కావలసిన పదార్థాలు:
సన్న బియ్యం లేదా బాస్మతి బియ్యం - 2 కప్పులు
పచ్చి మామిడికాయ - 1 (తరిగినది)
కొబ్బరి తురుము - 1/2 కప్పు
ఉల్లిపాయ - 1 (తరిగినది)
కరివేపాకు - 1 రెమ్మ
జీలకర్ర - 1/2 టీస్పూన్
ఆవాలు - 1/2 టీస్పూన్
పసుపు - 1/4 టీస్పూన్
ఎండు మిరపకాయలు - 2
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - (అలంకరించడానికి)
తయారీ విధానం:
ముందుగా పులిహోర నైవేద్యాన్ని తయారు చేసుకోవడానికి ఒక బౌల్లో బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కొని 20 లేదా 30 నిమిషాల పాటు బాగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో నూనె వేడి చేసి, జీలకర్ర, ఆవాలు, ఎండు మిరపకాయలు వేసి వేయించాలి.
అవన్నీ బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
ఆ తర్వాత బాగా వేగిన వీటిల్లో పసుపు తో పాటు ఉప్పు వేసి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి.
నానబెట్టిన విజయాన్ని పొడిపొడిగా స్ట్రీమ్ చేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
పొడిపొడిగా ఉడికించుకున్న అన్నాన్ని పెద్ద బౌల్లో వేసుకొని మామిడికాయ, కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులోనే పోపు పెట్టుకున్న పులిహోర పచ్చడిని వేసి బాగా మిక్స్ చేయాలి. అంతే సులభంగా మామిడికాయ పులిహోర నైవేద్యం రెడీ అయినట్లే..
చిట్కాలు:
పులిహోర మరింత రుచిగా ఉండడానికి పచ్చిమిరపకాయలను కూడా పోపులో వేసుకోవచ్చు.
అంతేకాకుండా పులిహోర రసం చిక్కగా ఉండేందుకు కొంత శెనగపిండి కూడా వేసి కలుపుకోవాలి.
మరింత రుచిని పొందడానికి పోపులో భాగంగా ఇంగువను కూడా వినియోగించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి