నిత్యం పని ఒత్డిడి, ఆందోళనతో పాటు జీవనశైలి, ఆహారపు అలవాట్లతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా మగవారిలో లైంగిక సామర్ధ్యం, లైంగిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రోజంతా ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా సామర్ధ్యం పడిపోతోంది. లైంగిక జీవితంలో సమస్యలు ఎదురౌతుంటాయి. కొన్ని రకాల అలవాట్లే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మగవారి లైంగిక సామర్ధ్యం పెరిగేందుకు ఎలాంటి అలవాట్లు మానుకోవాలో చూద్దాం..


ఈ దురలవాట్లు స్పెర్మ్‌కౌంట్ తగ్గిస్తాయి


రోజూవారీ జీవనశైలిలో భాగంగా చాలామంది ఒత్తిడికి లోనవుతుంటారు. ఇది మంచిది కాదు. పురుషులు తరచూ ఒత్తిడికి లోనవుతుంటే..స్పెర్మ్‌కౌంట్ తగ్గిపోతుంది. అదే పనిగా వివిధ కారణాలతో ఆందోళనకు లోనవడం కూడా స్పెర్మ్‌కౌంట్ తగ్గడానికి కారణమౌతుంది. అందుకే ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తుండాలి. దీనికి యోగా మంచి ప్రత్యామ్నాయం


వ్యాయామం లోపించడం


ప్రతి రోజూ వ్యాయామం లేకపోవడం వల్ల అధిక బరువు సమస్యగా మారుతుంది. ఎప్పుడైతే స్థూలకాయం ఉందో..స్పెర్మ్‌కౌంట్ పనితీరు మందగిస్తుంది. ఈ ప్రభావం లైంగిక జీవితంపై పడుతుంది. అందుకే ఒకేచోట ఉండిపోకుండా..వ్యాయామం చేస్తుండాలి. 


నిద్రలేమి


రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుంటే మానుకోవాలి. దీనివల్ల స్థూలకాయం, ఒత్తిడి సమస్యగా మారుతుంది. ఈ రెండు సమస్యల కారణంగా స్పెర్మ్‌కౌంట్ తగ్గుతుంది. రాత్రివేళ ఎక్కువసేపు మెళకువగా ఉంటే..మానసికంగా సమస్య ఎదురౌతుంది. ఇమ్యూనిటీ తగ్గుతుంది. అందుకే రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదు. రోజుకు 7-8 గంటల రాత్రి నిద్ర చాలా అవసరం. 


మద్యం తాగడం


మద్యం తాగడం, పొగాకు సేవించడం మగవారికి హాని కారకమమౌతుంది. మద్యం ఎక్కువగా తాగడం వల్ల టెస్టోస్టిరోన్‌పై చెడు ప్రభావం పడుతుంది. ఇదంతా స్పెర్మ్‌కౌంట్ తగ్గిపోతుంది. సిగరెట్ తాగడం వల్ల కూడా లైంగిక సామర్ధ్యం తగ్గిపోతుంది. 


Also read: Migraine Yoga Tips: ఈ మూడు ఆసనాలు వేస్తే చాలు..మైగ్రెయిన్ సమస్య క్షణాల్లో మటుమాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook