ఆధునిక జీవనశైలిలో తలపోటు సమస్య అధికంగా కన్పిస్తోంది. ముఖ్యంగా మైగ్రెయిన్ పెను సవాలుగా మారుతోంది. మైగ్రెయిన్ సమస్య ఎలా నియంత్రించుకోవాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుత బిజీ ప్రపంచంలో వివిధ రకాల కారణాలతో మైగ్రెయిన్ వ్యాధి తీవ్రమౌతోంది. తరచూ తలనొప్పి, టెన్షన్ దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి. మైగ్రెయిన్ ఉంటే..తలనొప్పి మరింతగాపెరిగిపోతుంటుంది. సరైన సమయంలో చికిత్స లేకపోతే..మనిషి మానసికంగా కృంగిపోతాడు. ఆలోచించే సామర్ధ్యం తగ్గిపోతుంది. రోజూ ఈ యోగాసనం వేస్తే..త్వరగానే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు
సేతు బంధాసనం
యోగాలో ఇదొక ప్రక్రియ. ఈ ఆసనం వేయడం చాలా సులభం. ముందు నేలపై పడుకోవాలి. రెండు చేతుల్ని కాళ్ల కింద పెట్టుకోవాలి. ఆ తరువాత నెమ్మది నెమ్మదిగా మోకాళ్లను నేలపైనుంచి పైకి లేపాలి. ఇప్పుడు నేలపై కేవలం మీ శరీరం పైభాగం చేతులు, కాళ్లు మాత్రమే ఉండాలి. ఓ 10 సెకన్లు ఈ స్థితిలో ఉండాలి. ఈ ఆసనాన్ని రెండు సార్లు రిపీట్ చేయాలి
బాలాసనం
యోగాలో ఇది మరో ప్రక్రియ. బాలాసనంలో మీ కాళ్లను పైకి పెట్టాలి. ఈ ఆసనంలో కాళ్లను ఎగువకు పెట్టి..కింది భాగాన్ని ముందుకు వంచాలి. ఈ ఆసనం వేసేటప్పుడు మీ భుజాలు పూర్తిగా ఓపెన్‌లో ఉండాలి. మీ ముఖం కూడా చేతులవైపుండాలి. ఈ ఆసనం వేయడం చాలా సులభం. ఇలా రోజుకు 3-5 సార్లు చేయాలి.
హస్తపాదాసనం
తలనొప్పి సమస్య నుంచి విముక్తి పొందేందుకు హస్తపాదాసనం చాలా మంచిది. ఈ ఆసనం కోసం ముందు నిటారుగా నిలుచోవాలి. నెమ్మదిగా ముందుకు వంగాలి. ఈ స్థితిలో శరీరాన్ని సగం వంచాలి. ఇప్పుడు రెండు చేతుల్ని కాళ్లవైపుకు తీసుకెళ్లాలి. ఈ యోగాసనం వేసేటప్పుడు ముఖం కాళ్లవైపుకు ఉండాలి. ఇలా 3-5 సార్లు చేయాలి.
Also read: Diabetes Tips: బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణకు ముఖ్యమైన టిప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook