Milk And Honey Benefits: మనలో చాలామంది తెనేను పాలలో కలుపుకొని తీసుకుంటారు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. దీని ప్రతిఒకరు ఇష్టపడుతుంటారు. అయితే రాత్రిపూట ఒక గ్లాసు పాలలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల బోలెడు ఆరోగ్యలాభాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.  దీని వల్ల కలిగే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు, తేనెను కలిపి తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు: 


నిద్రపోయే ముందు పాలలో తేనెను కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియవ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిద్రలేమి సమస్యలు కూడా తగ్గుతాయి. పాలలో ఉండే ఇమ్యునోగ్లోబిన్ లు అలాగే  తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.   పాలలో ఉండే కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఎముకలను బలంగా ఉంచడానికి సహాయపడతాయి. పాలలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయి.పాలు, తేనె రెండింటిలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే పాలు, తేనెలో బోలెడు లాభాలు ఉన్న దీని వల్ల కొన్ని సార్లు నష్టాలు కూడా కలుగుతాయి. దీని వల్ల నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పాలు, తేనె వల్ల కలిగే నష్టాలు: 


పాలు, తేనె రెండింటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అతిగా తీసుకుంటే బరువు పెరుగుతారు.  తేనెలో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు పాలు తేనె కలిపి తాగడం వల్ల షుగర్ లెవెల్ పెరిగే ప్రమాదం ఉంది. కొంతమందికి పాలలో ఉండే లాక్టోస్ జీర్ణం కాదు. దీని వల్ల వికారం, వాంతులు, అతిసారం వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.


పాలు తేనె ఎంత మోతాదులో తాగాలి :


ఇది  వ్యక్తి  వయసు, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమ స్థాయి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. షుగర్ లెవెల్ పెరగకుండా ఉండటానికి తేనె మోతాదును తగ్గించాలి లేదా పూర్తిగా మానుకోవాలి.  లాక్టోస్ జీర్ణం కాకపోతే, పాలు మానుకోవాలి లేదా లాక్టోస్-రహిత పాలు తాగాలి.


పాలు తేనె తాగడానికి ముందు:


తాజా పాలు నాణ్యమైన తేనెను ఉపయోగించండి.
పాలు, తేనెను బాగా కలిపి తాగండి.
ఖాళీ కడుపుతో తాగడం మంచిది.
రాత్రి నిద్రపోయే ముందు తాగడం వల్ల నిద్ర బాగా వస్తుంది.


పాలు తేనె కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీ వైద్యుడిని సంప్రదించి, ఎంత మోతాదులో తాగాలో తెలుసుకోండి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి