Milk And Raisins For Weight Gain: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఎండు ద్రాక్షలను తినడం వల్ల శరీరాని పోషకాలు లభించి పొట్ట సమస్యలు సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఎండుద్రాక్షను పాలలో కలిపి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాలలో ఎండు ద్రాక్ష కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలు, ఎండుద్రాక్ష:
ఎండుద్రాక్షలో విటమిన్లు ఎ, డి, కె అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి పాలలో కలిపి తాగడం వల్ల ఐరన్ శరీరానికి లభిస్తాయి. అంతేకాకుండా ఇందులో విటమిన్-బి, క్యాల్షియం, ప్రొటీన్లు కూడా లభిస్తాయి. ఇలా మిక్స్‌ చేసుకుని తాగడం వల్ల శరీరం దృఢంగా తయారవుతుంది. కాబట్టి పాలలో ఎండు ద్రాక్షను కలుపుకుని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


ఈ సమయంలో తాగితే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి:
ఎండుద్రాక్షను పాలలో కలిపి రాత్రి పూట తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. అంతేకాకుండా అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఇలా ఎండు ద్రాక్షను పాలలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.


ఎండుద్రాక్ష పాలు గుండెకు మేలు చేస్తాయి:
పాలు, ఎండుద్రాక్ష గుండెకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో మినరల్స్, ఫైబర్, పొటాషియంతో పాటు అనేక విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు, ఖనిజాలన్నీ గుండెకు చాలా మేలు చేస్తాయి. అందుకే గుండె దృఢంగా ఉండాలంటే పాలు, ఎండుద్రాక్షలను ప్రతి రోజూ తీసుకోవాల్సి ఉంటుంది.


బరువు పెరగడానికి:
అంతే కాకుండా ఎండు ద్రాక్షను పాలలో కలిపి తాగడం వల్ల కూడా శరీర బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడంతో పాటు బరువు తగ్గుతున్నారు. అయితే తగ్గిన బరువును పెంచుకోవడానికి తప్పకుండా ఎండుద్రాక్ష కలిపిన పాలను ప్రతి రోజూ సాయంత్రం తాగాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


ఎముకల దృఢత్వం కోసం:
ద్రాక్షలో క్యాల్షియం, ప్రొటీన్లు పాలలో తగినంత పరిమాణంలో లభిస్తాయి. ఇలా పాలను కలిపి ప్రతి రోజూ తాగడం వల్ల ఎముకలు సులభంగా దృఢంగా తయారవుతాయి. అంతేకాకుండా ఎముల సమస్యలు కూడా తగ్గుతాయి. జిమ్‌ చేసే క్రమంలో ఈ డ్రింక్‌ను తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు రక్త పోటు సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.


ఇది కూడా చదవండి : Revanth Reddy: పొద్దునలేస్తే రాత్రి వరకు కేటీఆర్ సినిమా వాళ్లతోనే.. సమంత సోకులు మాకొద్దు: రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు


ఇది కూడా చదవండి : Jaggareddy Interesting Comments: సీఎం కేసీఆర్‌ని కలిస్తే తప్పేంటన్న జగ్గారెడ్డి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


యాపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook