Milk Uses for Face Benefits: పచ్చి పాలతో చర్మానికి బోలెడు లాభాలు, రోజు ఇలా చేయండి..
Milk Uses for Face Benefits: పచ్చి పాలను చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ముఖంపై ముడుతలు కూడా తొలగిపోతాయి.
Milk Uses for Face Benefits: పెరుగుతున్న కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది చర్మంలో మార్పులు వస్తున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ చర్మ సమస్యల బారిన పడుతున్నారు. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఖరీదైన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆయుర్వేద నిపుణులు సూచించిన పచ్చి పాలను వినియోగించాల్సి ఉంటుంది. చర్మ సమస్యలతో బాధపడేవారు పచ్చి పాలను అప్లై చేయడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. అయితే పాలను చర్మంతో పాటు ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి పాలలో పొటాషియం, కాల్షియం, ప్రొటీన్, ఫాస్పరస్ వంటి అన్ని పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే పోషకాలు చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా ముఖాన్ని రెట్టింపు నిగారింపుతో ఉంచుతుంది.
పచ్చి పాలను ముఖానికి అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గ్లోయింగ్ స్కిన్:
పచ్చి పాలను ముఖానికి పట్టించి 7 నుంచి 8 నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల ముఖం అందంగా తయారవుతుంది. అంతేకాకుండా మచ్చలేని చర్మాన్ని కూడా పొందుతారు.
ముడుతలు తొలగిపోతాయి:
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడేవారు ప్రతి రోజు 10 నుంచి 15 నిమిషాల పాటు పచ్చి పాలతో మసాజ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు ముడతలు, వృద్ధాప్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మొటిమలు తొలగిపోతాయి:
తరచుగా మొటిమల సమస్యలతో బాధపడేవారు.. ప్రభావిత ప్రాంతంలో పచ్చి పాలను అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాలు అలాగే ఉంచండి. ఇలా రెండు నుంచి మూడు వారాల పాటు అప్లై చేయడం వల్ల సులభంగా ఫలితాలు పొందుతారు.
డార్క్ సర్కిల్స్:
డార్క్ సర్కిల్స్ వల్ల ముఖం అందహీనంగా తయారవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు పచ్చి పాలను ప్రతి రోజు ప్రభావిత ప్రాంతాల్లో వినియోగించడం వల్ల డార్క్ సర్కిల్స్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి