COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mint Leaves Refreshing Drinks: వాతావరణంలో వేడి తీవ్రత విపరీతంగా పెరగడంతో చాలా మంది తమ ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. వేడి కారణంగా చాలా మందిలో జీర్ణక్రియ సమస్యలు వస్తున్నాయి. దీంతో పాటు కొంతమందిలో డిహైడ్రేషన్‌ సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సమయంలో శరీరాన్ని చల్లదనంగా ఉంచుకోవడం చాలా మంచిది. అలాగే ఈ సమయంలో తప్పకుండా శరీరాన్ని రిఫ్రెష్‌ చేసే కొన్ని డ్రింక్స్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి రోజు పుదీనా ఆకులతో తయారు చేసిన రిఫ్రెష్ డ్రింక్స్‌ కూడా ఎండా కాలంలో మన శరీరంలోని వేడిని తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడుతుంది.  అయితే ప్రతి రోజు ఈ డ్రింక్‌ను తాగడం వల్ల శరీరానికి కలిగే లాభలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 


పొట్ట సమస్యలు:
వేసవిలో ప్రతి రోజు పుదీనా రిఫ్రెష్‌ డ్రింక్‌ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా పొట్ట ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్‌ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు దీర్ఘకాలిక అనేక పొట్ట సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా తిన్న తర్వాత ఈ రసాన్ని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. 


నోటి దుర్వాసన నుంచి ఉపశమనం:
ప్రతిరోజూ పుదీనా టీతో తయారు చేసి టీ లేదా రిఫ్రెష్‌ డ్రింక్‌ తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఇదులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది. దీంతో పాటు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 


గొంతు నొప్పి:
పుదీనా రిఫ్రెష్‌ డ్రింక్‌ తాగడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. అంతేకాకుండా దగ్గు, జలుబు, ఛాతీ నొప్పి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీంతో పాటు తరచుగా గొంతు నొప్పి సమస్యలతో బాధపడేవారికి ఈ డ్రింక్‌ ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీర రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


బరువు తగ్గించేందుకు..
ప్రతి రోజు పుదీనా టీ తాగడం వల్ల శరీర బరువును నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని నియంత్రించేందుకు కూడా కృషి చేస్తుంది. దీంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి