Monsoon: వర్షంలో ఎక్కువసేపు నానడం వల్ల తలనొప్పి వస్తుందా.. ఈ టీతో కేవలం 5 నిమిషాల్లో చెక్ పెట్టొచ్చు
Monsoon Health Problems: తరచుగా తీవ్ర తల నొప్పులతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన తులసి కషాయాన్ని ప్రతిరోజు తాగాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తాయి.
Monsoon Health Problems: వర్షాలు కురవడం కారణంగా చాలామందిలో ఇన్ఫెక్షన్లు వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి క్రమంలో శరీరంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే ఆరోగ్యం మరింత చెడిపోయే అవకాశాలున్నాయి. వానాకాలంలో తరచుగా వచ్చే సమస్యల్లో తలనొప్పి ఒకటి. వాతావరణం లో తేమ ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల చాలామందిలో ఇన్ఫెక్షన్లతో పాటు తలనొప్పి సమస్య కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తరచుగా మార్కెట్లో లభించే పెయిన్ కిల్లర్స్ వినియోగిస్తూ ఉంటారు. వీటిని వినియోగించడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని చిట్కాలు పాటించడం వల్ల సులభంగా తలనొప్పి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
వానాకాలంలో చాలామంది తేమ కారణంగా డీహైడ్రేషన్‌కు గురవుతారు. దీంతో శరీరంలోని నీరంతా ఒక్కసారిగా బయటకు వచ్చి తలనొప్పి సమస్యలు స్టార్ట్ అవుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు మహిళల్లో ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ తలనొప్పి రావడానికి ఇంకో కారణం కూడా ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మహిళలు ఎక్కువగా జుట్టును కట్టుకొని ఉంచుతారు. దీని కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి తరచుగా తలనొప్పి సమస్యలతో బాధపడుతున్న వారు జుట్టును వదిలేయడం చాలా మంచిది.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
తలనొప్పి తో బాధపడుతున్న వారు చల్లటి నీళ్లతో స్నానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత తలకు కొబ్బరి నూనెతో మసాజ్ చేసి 15 నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల కూడా తలనొప్పి సమస్య నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఒత్తిడి సమస్య నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని వారంటున్నారు.
తీవ్రతలనొప్పి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులతో తయారుచేసిన కషాయాన్ని తాగడం వల్ల కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు తలనొప్పిని తగ్గించడమే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. తరచుగా తీవ్ర పొట్ట సమస్యలతో బాధపడేవారు కూడా ప్రతిరోజు తులసి ఆకుల కషాయాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Heavy Rains: ఎడతెరిపి లేని భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook