TS Govt Declare Holidays: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని విద్యాసంస్థలకు గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటించింది. కేసీఆర్ ఆదేశాలతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ, రేపు సెలవులు ప్రకటించారు. "రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం, శుక్రవారం సెలవులు ఉంటాయి.." అని మంత్రి ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రకటనతో ఇప్పటికే స్కూళ్లకు చేరుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్తున్నారు. అయితే సెలవులు తమకు లేవని కాలేజీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అన్ని విద్యాసంస్థలు అని విద్యాశాఖ మంత్రి క్లారిటీగా చెప్పడంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలతో పాటు యూనివర్సిటీలకు సెలవులు వర్తించనున్నాయి.
Keeping in view of the heavy rainfall in the state and under the instructions of the Honourable CM, KCR garu, the Govt has decided to declare holidays for two days to all education institutions in the state. That is Thursday and Friday.
— SabithaReddy (@SabithaindraTRS) July 20, 2023
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇవాళ అల్పపీడనంగా బలపడనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగనున్నాయి. అల్పపీడన ప్రభావంతో గురువారం, శుక్రవారం ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి వర్షాల ఉధృతి పెరగనుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.
తెలంగాణలోని మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంగనర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లోని మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
తెలంగాణలో హైదరాబాద్‌తోపాటు సహా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరంలోని రోడ్లపై నీరు నిలవడంతో ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు మంజూరు చేసింది.
Also Read: Manipur Violence: మణిపూర్‌లో భయంకరమైన వీడియో.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి.. దారుణం..!
Also Read: Viral Video: జేసీబీపై దూసుకువచ్చిన భారీ బండరాళ్లు.. క్షణాల్లో తప్పించుకున్న డ్రైవర్.. వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook