Walking: బరువు తగ్గడానికి ఉదయం వాకింగ్ మంచిదా లేక సాయంత్రం వాకింగ్ మంచిదా..?
Walking For Weight Loss: వాకింగ్ చేయడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు. అయితే ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారా? ఏ సమయంలో చేయడం మంచిది అనేది మనం తెలుసుకుందాం.
Walking For Weight Loss: అధిక బరువు అనేది చాలా సాధారణ విషయం అయినప్పటికి దీని వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకండా వ్యాయామం తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. బరువు పెరగడానికి బోలెడు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్, అతి తీపి కలిగిన పదార్థాలు, కార్బోహైడేట్స్ కలిగిన ఆహారం పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సమస్య కలుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో అధిక బరువు వారికి నుంచి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని సార్లు థైరాయిడ్, ఇన్సులిన్ వంటి హార్మోన్ సమస్యల కారణంగా కూడా ఈ సమస్యతో బాధపడుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొన్ని కాల మందులు బరువు పెరగడానికి కారణం కావచ్చు. దీని కారణంగా గుండె సమస్యలు, డయాబెటిస్, మూత్రపిండల సమస్య, క్యాన్సర్, మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. అయితే ఈ సమస్యల నుంచి బయటపడ్డానికి ప్రతిరోజు ఉదయం వ్యాయామం, వాకింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గడానికి ఉదయం వాకింగ్ మంచిదా లేక సాయంత్రం వాకింగ్ మంచిదా అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. నిజానికి, రెండూ కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
వాకింగ్ అనేది బరువు తగ్గడానికి చాలా సులభమైన వ్యాయామం, ఇది కేవలం బరువు తగ్గించడమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాకింగ్ చేసేటప్పుడు మన శరీరం కేలరీలను వినియోగించుకుంటుంది. ఇది క్రమంగా కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల మన శరీరంలోని చయాపచయం పెరుగుతుంది. దీనివల్ల మనం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కేలరీలు బర్న్ అవుతాయి. వాకింగ్ గుండె రేటును పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. వాకింగ్ చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
ఉదయం వాకింగ్ ప్రయోజనాలు:
చర్మం మెరుగుపడుతుంది: ఉదయం తాజా గాలిలో నడవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది.
మెదడుకు మంచిది: ఉదయం వాకింగ్ చేయడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ పెరిగి, మెదడు చురుగ్గా పని చేస్తుంది.
మొత్తం శరీరంలో శక్తి పెరుగుతుంది: ఉదయం వాకింగ్ చేయడం వల్ల మొత్తం శరీరంలో శక్తి పెరుగుతుంది.
మనోధైర్యం పెరుగుతుంది: ఉదయం తాజా గాలిలో నడవడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది.
సాయంత్రం వాకింగ్ ప్రయోజనాలు:
నిద్ర బాగా పడుతుంది: సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల నిద్ర బాగా పడుతుంది.
ఒత్తిడి తగ్గుతుంది: సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
కండరాలు సడలతాయి: సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల కండరాలు సడలతాయి.
బరువు తగ్గడానికి వాకింగ్ ఎలా చేయాలి?
రోజువారీ వాకింగ్: వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన తీవ్రతతో వాకింగ్ చేయాలి.
వేగం పెంచండి: క్రమంగా వాకింగ్ వేగాన్ని పెంచుకోవడం మంచిది.
ఇంక్లైన్ పెంచండి: కొండలు లేదా ఎత్తు ప్రదేశాల్లో వాకింగ్ చేయడం వల్ల ఎక్కువ కేలరీలు బర్న్ అవుతాయి.
వాకింగ్ రూట్స్ మార్చండి: ప్రతిరోజూ ఒకే రూట్‌లో వాకింగ్ చేయకుండా, వేర్వేరు రూట్స్‌ను ఎంచుకోవడం మంచిది.
వాకింగ్‌తో ఇతర వ్యాయామాలు చేయండి: వాకింగ్‌తో పాటు ఇతర వ్యాయామాలు చేయడం వల్ల మరింత మంచి ఫలితాలు లభిస్తాయి.
ఏది మంచిది?
మీకు ఏది సౌకర్యంగా ఉంటుందో అది ఎంచుకోండి. ఉదయం లేవడం కష్టమైతే, సాయంత్రం వాకింగ్ చేయండి. సాయంత్రం ఇతర పనులు ఉంటే, ఉదయం వాకింగ్ చేయండి. రెండూ చేయడానికి ప్రయత్నించండి. రెండు సమయాల్లో కూడా వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి