Multi Millet Noodles Recipe: మిల్లెన్స్‌ నూడిల్స్‌కి మార్కెట్‌లో రోజురోజుకు డిమాండ్‌ పెరిగిపోతోంది. చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మిల్లెన్స్‌తో కూడి ఆహారాలు తినేందుకు ఇష్టపడుతున్నారు. అలాగే స్ట్రీట్‌ ఫుడ్స్‌లో ఎక్కువ తినే వాటి నూడ్స్‌ కూడా మిల్లెన్స్‌తో తయారు చేస్తున్నారు. స్నాక్స్‌ నూడిల్స్‌ తినాలనుకుంటున్న వారు మల్టీ మిల్లెన్స్‌తో తయారు చేసిన నూడిల్స్‌ను వివిధ రకాల రెసిపీల్లో తయారు చేసుకుని తింటున్నారు. వీటిని ప్రతి రోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే వీటిని మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా తినొచ్చు. మీరు కూడా ఈ మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌ను ఇంట్లోనే తయారు చేసుకుని తినాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా ఈ పద్ధతిలో తయారు చేసుకుని తినండి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1 ప్యాకెట్ మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌
1/2 కప్పు కూరగాయలు (క్యారెట్, క్యాబేజీ, బీన్స్, మొదలైనవి)
1/4 కప్పు ఉల్లిపాయలు (తరిగినవి)
1/4 కప్పు క్యాప్సికమ్ (తరిగినవి)
2 టేబుల్ స్పూన్ల సోయా సాస్
1 టేబుల్ స్పూన్ వెనిగర్
1 టేబుల్ స్పూన్ చక్కెర
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ మిరియాలు
2 టేబుల్ స్పూన్ల నూనె


తయారీ విధానం:
ముందుగా మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌ తయారు చేసుకోవడానికి ఒక బౌల్‌ తీసుకోవాల్సి ఉంటుంది. 
ఒక పాత్రలో నీరు మరిగించి, అందులో మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌ వేసి, ప్యాకెట్‌పై ఉన్న సూచనల ప్రకారం ఉడికించాల్సి ఉంటుంది.
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, అందులో ఉల్లిపాయలు వేసి హై ఫ్లేమ్‌పై వేయించాల్సి ఉంటుంది.
ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత, కూరగాయలు, క్యాప్సికమ్ వేసి మరింత కొద్దిసేపు వేయించాలి.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!
కూరగాయలు మెత్తబడిన తర్వాత, సోయా సాస్, వెనిగర్, చక్కెర, ఉప్పు, మిరియాలు వేసి బాగా కలపాలి.
ఉడికించిన నూడిల్స్‌ను కూరగాయల మిశ్రమంతో కలిపి, బాగా కలపాల్సి ఉంటుంది. అంతే సులభంగా రెడీ అయినట్లే..


చిట్కాలు:
మల్టీ మిల్లెన్స్‌ నూడిల్స్‌ ఇంకా బాగా రుచితో పొందడానికి ఇష్టమైన కూరగాయాలను వేసుకోవాల్సి ఉంటుంది.
వీటిని మరింత రుచిగా పొందడం కోసం నూడిల్స్‌కు కొద్దిగా చిలి సాస్ యాడ్‌ చేయాల్సి ఉంటుంది.
ఇందులో గార్నీష్‌గా పై నుంచి తురుముకున్న కూరగాయలను కూడా వినియోగించవచ్చు. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి