మీకో విషయం తెలుసా.. జులై 29.. ఈ రోజు పలు దేశాలు లిప్‌స్టిక్ డేను జరుపుకుంటున్నాయి. మహిళల అందానికి మరింత మెరుగులు దిద్ది.. వారి సౌందర్యాన్ని పెంపొందించే సీక్రెట్ లిప్‌స్టిక్‌తో రంగును అద్దుకోవడంలోనే ఉందని పలువురు ఫ్యాషన్ డిజైనర్లు అంటున్నారు. అయితే లిప్ స్టిక్‌కు సంబంధించి పలుదేశాల్లో నిషేధం కూడా ఉంది. లిప్ స్టిక్ అనేది వివాదాలకు కేంద్రంగా కూడా మారింది. మహిళల సహజ సౌందర్యాన్ని లిప్ స్టిక్ దూరం చేస్తుందని కొందరు అంటే.. మగాళ్లను బుట్టలో వేయడానికి కొందరు మంత్రగత్తెలు లిప్ కలర్‌తో ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తారని కూడా పలు కథలు ప్రచారాలు ఉన్నాయి. అయితే ఎవరు ఏం చెప్పినా.. లిప్‌స్టిక్‌ను ఈ రోజు చెప్పుకోదగ్గ బ్రాండెడ్ కంపెనీలు అన్ని కూడా తయారుచేస్తున్నాయి. మరి లిప్‌స్టిక్ డే సందర్భంగా.. ఈ పెదాల రంగు వెనుక ఉన్న కథా కమామీషు ఏంటో మనం కూడా తెలుసుకుందామా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*లిప్‌స్టిక్ వాడకం అనేది ఈ రోజుది కాదు. అనేక శతాబ్దాలుగా రాజ కుటుంబాల్లో కూడా పెదాలకు లిప్ కలర్ అద్దుకోవడం అనేది సంప్రదాయంగా వస్తోంది.


*1770లో తొలిసారిగా బ్రిటీష్ పార్లమెంట్ లిప్‌స్టిక్ వాడకాన్ని నిషేధించింది. లిప్‌స్టిక్ వాడే మహిళలను మంత్రగత్తెలుగా ప్రచారం చేసింది. లిప్‌స్టిక్ వాడే అమ్మాయిలు ఆకర్షణీయంగా కనబడతారని.. కానీ నిజానికి వారు మోసగత్తెలని.. మగాళ్లను లొంగదీసుకోవడం కోసం వారు లిప్‌స్టిక్‌తో ఆకట్టుకుంటారని తెలిపింది.


*విక్టోరియా మహారాణి లాంటి వారి వద్దకు వచ్చేటప్పుడు.. మహిళలు లిప్‌ కలర్ ధరించి రావడాన్ని నిషేధించారు. అలా లిప్‌ కలర్ వేసుకొని వస్తే.. అది రాణికి జరిగే అవమానంగా భావించేవారు. 


*కానీ కొన్నాళ్ల తర్వాత లిప్‌స్టిక్ ఎంత క్రేజ్ సంపాదించుకుందంటే.. ఆడాళ్లతో పాటు మగాళ్లు కూడా లిప్‌స్టిక్ వాడేవారు. జార్జి వాషింగ్టన్ లాంటివారు కూడా లిప్ కలర్ వేసుకోవడం ప్రారంభించారు.


*జార్జి వాషింగ్టన్ లాంటివారు సైతం లిప్‌స్టిక్ వాడడంతో.. అమెరికా లాంటి దేశాల్లో లిప్‌స్టిక్ డే పేరుతో ఒక రోజు కూడా ఏర్పడిపోయింది. కొత్త ఫ్యాషన్ సంప్రదాయాలను ప్రోత్సహించే దిశగా.. పలు ఫ్యాషన్ ఈవెంట్స్ నిర్వహించడం ఈ రోజు ప్రత్యేకత.


*కొన్నాళ్లు లిప్‌స్టిక్ డే అనేది ఒకటి ఉందని జనాలు మర్చిపోయారు. 2016లో హుడా కట్టన్ అనే మహిళా బ్లాగర్ లిప్‌స్టిక్ డే గురించి మళ్లీ ప్రజలకు తన బ్లాగు ద్వారా తెలియజేశారు. 


*లిప్‌స్టిక్ వాడడంతో మహిళలలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని కొందరు అంటే.. అది దెయ్యాల సంప్రదాయమని కూడా పలువురు అంటున్నారు.