Natukodi Pulao Recipe: చిట్టి ముత్యాల రైస్ నాటుకోడి పలావ్.. పిల్లలైతే వదలకుండా తింటారు..
Natukodi Pulao Recipe: చిట్టి ముత్యాల రైస్ నాటుకోడి పలావ్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రెసిపీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ వీకెండ్ లో తప్పకుండా ఇలా సులభమైన పద్ధతిలో ట్రై చేయండి.
Natukodi Pulao Recipe: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన రెసిపీల్లో చిట్టి ముత్యాల రైస్ నాటుకోడి పలావ్ ఒకటి. దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే నాటుకోడి తో తయారుచేసిన ఈ పలావుని పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ పలావ్ వివిధ పద్ధతిలో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చాలామంది చిట్టి ముత్యాల రైస్ నాటుకోడి పలావ్ ను రెస్టారెంట్ల నుంచి ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటారు. ఇలా తరచుగా చేయడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ పలావ్ ను సులభంగా ఇంట్లో తయారు చేసుకోవడానికి ప్రత్యేక పద్ధతిని పరిచయం చేయబోతున్నాం. ఈ చిట్టి ముత్యాల రైస్ నాటుకోడి పలావ్ కి కావలసిన పదార్థాలు ఏంటో? తయారీ విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
నాటుకోడి - 500 గ్రాములు
చిట్టి ముత్యాల బియ్యం - 2 కప్పులు
ఉల్లిపాయలు - 2 (పెద్దవి)
టమాటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర, పుదీనా - కొద్దిగా
ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
జీలకర్ర పొడి - 1 టేబుల్ స్పూన్
బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్
కారం - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1/2 టీస్పూన్
ఉప్పు - సరిపడ
నూనె - 2 టేబుల్ స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
యాలకులు - 2
నిమ్మరసం - సరిపడ
తయారీ విధానం:
చిట్టి ముత్యాల బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి.
నాటుకోడిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత స్టవ్ పై ఓ బౌల్ పెట్టుకొని నూనె, నెయ్యి వేడి చేసి అందులో బిర్యానీ ఆకులు, యాలకులు వేసి వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
బాగా వేగిన తర్వాత అందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించాలి.
ఆ తర్వాత టమాటో ముక్కలు, కారం, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అన్ని వేసి కలిపిన తర్వాత నానబెట్టిన బియ్యం, నాటుకోడి ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత బియ్యానికి తగిన నీరు పోసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించాలి.
బియ్యం ఉడుకుతున్న సమయంలో ధనియాల పొడి, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
ఆ తర్వాత చివరగా కొత్తిమీర, పుదీనా చల్లి నిమ్మరసం పోసి వేడిగా వడ్డించాలి.
చిట్కాలు:
నాటుకోడిని ముందురోజు రాత్రి పెరుగులో నానబెడితే మరింత రుచిగా ఉంటుంది.
పులావ్ కి మరింత రుచి రావడానికి షాహీ జీరా, దాల్చిన చెక్క, లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలను కూడా వాడవచ్చు.
బియ్యం నానబెట్టడానికి వేడి నీరు వినియోగించడం వల్ల బియ్యం పుల్లలు పుల్లలుగా ఉంటుంది.
పులావ్ ఉడికించేటప్పుడు మూత తీయకుండా ఉండడం వల్ల మరింత రుచిని పొందవచ్చు.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి