Natural Makeup Removers: సాదారణంగా ఏదైనా పార్టీలు ఫంక్షన్ వెళ్ళినప్పుడు మేకప్ వేసుకుంటాము అయితే తిరిగి వచ్చాక మేకప్ తీసి పడుకోవాలి. లేకపోతే చర్మంపై హానికర ప్రభావాన్ని చూపిస్తాయి. దీనికి ఇంటి వంట గదిలో ఉండే కొన్ని వస్తువులు ఉన్నాయి. దీంతో సులభంగా మేకప్ తీసేయవచ్చు. సాధారణంగా మార్కెట్లో దొరికే కొన్ని మేకప్ రిమూవర్ లు కూడా స్కిన్ ప్రాబ్లం ని తీసుకువస్తాయి. ఇంటి వంట గదిలోని వస్తువులను వాడటం వల్ల సహజసిద్దంగా మేకప్ ని తీసేయవచ్చు. అవేంటో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొబ్బరి నూనె..
కొబ్బరి నూనె మన ఇంట్లో ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది. నిర్మొహమాటంగా కొబ్బరి నూనెను మేకప్ రిమూవర్ గా వాడవచ్చు. అంతేకాదు ఇందులోని ఎస్పీఎఫ్ మన స్కిన్ కి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. కొబ్బరి నూనె కొద్దిగా తీసుకొని కాటన్ ప్యాడ్‌ తో మృదువుగా మన ముఖంపై ఉన్న మేకప్ ని తీసేయవచ్చు.


పాలు..
పాలు కూడా నేచురల్ క్లెన్సర్లా పనిచేస్తుంది. పాలతో మనం ముఖంపై ఉన్న మేకప్ ని తొలగించవచ్చు. పాలలో కాటన్ బాల్ ని డిప్ చేసి ముఖంపై మృదువుగా రుద్దాలి. ఇలా మేకప్ తొలగించుకోవచ్చు అంతేకాదు చివరగా ముఖంపై పాలను కొద్దిగా అప్లై చేసుకుంటే ముఖం మృదువుగా మెరుస్తూ కనిపిస్తుంది.


ఇదీ చదవండి: పొటాటో ట్విస్టర్స్ ఇలా చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు..


జోజోబా ఆయిల్..
ఈ ఆయిల్ కూడా మేకప్ రిమూవ్ చేయడానికి పనిచేస్తుంది. కొద్దిగా జోజోబా ఆయిల్ తీసుకొని మొఖంపై మసాజ్ చేయాలి. రెండు నిమిషాల పాటు ఆ తర్వాత వేడి గోరువెచ్చని గుడ్డతో ముఖమంతా తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మేకప్ పూర్తిగా తొలగిపోతుంది.


కలబంద..
కలబంద కూడా మన ఇంట్లో ఎప్పటికీ ఉండే వస్తువే దీంతో కూడా ముఖం పై ఉన్న మేకప్ ని తొలగించవచ్చు. ఈ కలబంద జెల్ తో ముఖం మాయిశ్చరైజింగ్ గుణాలు కలిగి ఉంటుంది. కొద్దిగా కలబంద తీసుకొని కాటన్ బాల్ తో మృదువుగా ముఖంపై మేకప్ ని తొలగించుకోవాలి. దీనివల్ల ముఖంపై ఉండే మచ్చలు కూడా తొలగిపోతాయి.


ఇదీ చదవండి: రుచికరమైన పంజాబీ స్టైల్ రాజ్మా రైస్ రెసిపీ.. ఇలా సింపుల్ గా చేసుకోండి..


బాదం నూనె..
బాదం నూనెలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాటన్ బాల్ తీసుకొని మూడు చుక్కల బాదం నూనెను ఒకమంతా మసాజ్ చేయాలి తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి