New Year Cake 2022: న్యూఇయర్ కోసం ఇంట్లోనే మ్యాంగో చీజ్ కేక్ తయారీ ఎలానో తెలుసా?
New Year Cake 2022: ఇప్పటివరకు ఎన్నో ఫ్లేవర్స్‌తో చేసిన కేక్‌లు తిని ఉంటాం. మరి మ్యాంగో ఛీజ్ కేక్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోయి ఉంటే న్యూఇయర్ సెలెబ్రేషన్ లో భాగంగా ఇంట్లోనే తయారుచేసుకుని రుచి చూసేయండిలా!
New Year Cake 2022: న్యూఇయర్ సందర్భంగా జరిగే సెలెబ్రేషన్స్ లో కేక్ తప్పనిసరిగా ఉంటుంది. దీంతో పాటు పుట్టినరోజు, పెళ్లిరోజు.. ఇలా వేడుక ఏదైనా ముందుగా గుర్తొచ్చేది కేక్. ఇలాంటి సమయాల్లో కేక్ కట్ చేసి తింటూ సెలబ్రేషన్స్ చేసుకోవడం మనకు అలవాటే. భిన్నమైన ఫ్లేవర్స్‌లో దొరికే ఈ కేక్‌ను ఏదో ఒక బేకరీ నుంచి కొనుగోలు చేయడమో.. అప్పుడప్పుడూ ఇంట్లో తయారుచేసుకోవడమో చేస్తుంటాం. అయితే మీరు ఎప్పుడైనా మ్యాంగో ఛీజ్ కేక్ తిన్నారా? తినకపోతే ఒకసారి ట్రై చేయండి. అందుకోసం దీని తయారీ విధానం మీకోసం.
కావాల్సిన పదార్థాలు
10 బిస్కెట్లు, వెన్న- 50 గ్రాములు z, పన్నీర్- 30 గ్రాములు, క్రీమ్ ఛీజ్- 30 గ్రాములు, హంగ్ కర్డ్- 30 గ్రాములు, ఫ్రెష్ క్రీమ్- 30 గ్రాములు, కస్టర్డ్- 50 గ్రాములు, మ్యాంగో గుజ్జు- 50 గ్రాములు (మ్యాంగో దొరకని పక్షంలో పైనాపిల్ లేదా మ్యాంగో ఫ్లేవర్ ఎసెన్స్, మ్యాంగో డ్రింక్ వాడుకొవచ్చు), జెలిటన్- 5 గ్రాములు, కొన్ని మామిడి పండు ముక్కలు.
తయారీ విధానం
ముందుగా ఓ బౌల్లో బిస్కెట్స్ తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. అందులో కరిగించిన వెన్న వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ఓ గ్లాస్ బౌల్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
ఇంకో గిన్నెలో పన్నీర్‌ను మెత్తగా చేసుకోవాలి. అందులో క్రీమ్ ఛీజ్, హంగ్ కర్డ్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఆ తర్వాత కస్టర్డ్, మ్యాంగో గుజ్జు (పైనాపిల్) , బేసిల్(తులసి), మామిడి పండు ముక్కలు (పైనాపిల్ ముక్కలు), కరగపెట్టిన జెలిటన్ను వేసి మరోసారి బాగా కలపాలి. దీన్ని మ్యాంగో లేదా పైనాపిల్ క్రీమ్ అంటారు.
ముందుగా మనం కలిపిపెట్టుకున్న బిస్కెట్ గుజ్జు మిశ్రమం పైన మ్యాంగ్ లేదా పైనాపిల్ క్రీమ్‌ను వేసి దానిపైనా మామిడి లేదా పైనాపిల్ ముక్కలను నచ్చిన విధంగా పరచాలి. ఆ తర్వాత నాలుగు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. అంతే.. మీకు కావాల్సిన టేస్టీ మ్యాంగో ఛీజ్ కేక్ రెడీ.
[[{"fid":"218810","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
Also Read: New Year's Eve: 2021లో చివరి డూడుల్ రిలీజ్.. న్యూఇయర్ ఈవినింగ్ డూడుల్ ను చూశారా?
Also Read: Christmas 2021: క్రిస్మస్ పండుగ రోజున ఎంతో ఇష్టంగా తినే వంటకాలేంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి