Dull Skin: ఈ అలోవెరా క్రీమ్‌తో డల్ స్కిన్ పోయి మెరిసే చర్మం మీ సొంతం!
Night Cream For Dull Skin: చాలా మంది మెరిసే చర్మం పొందడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాకుండా కొందరైతే మార్కెట్‌లో లభించే క్రీమ్స్ కూడా వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించిన ఫలితం పొందలేకపోతున్నారు. మంచి ఫలితాలు పొందడానికి ఈ చిట్కాను వినియోగించండి.
Night Cream For Dull Skin: చర్మం ఎప్పుడు మెరుస్తూ ఉంటేనే శరీరం అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఆకర్శనీయంగా కనిపిస్తారు. అయితే చాలా మంది మెరిసే చర్మం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ పొందలేకపోతున్నారు. మార్కెట్‌లో లభించే చాలా రకాల రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. అయితే వీటిని వినియోగించడం వల్ల తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. మెరిసే చర్మం పొందడానికి, చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు ఇంటి చిట్కాలను కూడా వినియోగించాల్సి ఉంటుంది. రోజూ నిద్రపోయే ముందు ఈ హోంమేడ్ క్రీమ్‌ని చర్మంపై అప్లై చేసి మసాజ్ చేస్తే మంచి ఫలితాలు పొందుతారని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనిని వినియోగించడం వల్ల ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మెరిసే చర్మం కోసం హోం మేడ్ క్రీమ్:
ఈ క్రీమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అలోవెరా జెల్, బియ్యం, కొబ్బరి నూనె, రోజ్ వాటర్, క్రీమ్ ఉంచడానికి ఒక చిన్న డబ్బా..
క్రీమ్ తయారి విధానం:
మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన క్రీమ్ తయారు చేయడానికి, ముందుగా బియ్యం తీసుకోండి. తర్వాత వాటిని బాగా కడిగి, నీటిలో కాసేపు నానబెట్టాలి. తర్వాత బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్‌కు 1 టీస్పూన్ అలోవెరా జెల్, రోజ్ వాటర్, కొబ్బరి నూనె కలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక డబ్బాలో ఈ క్రిమ్‌ను వేసి రాత్రి పడుకునే ముందుకు చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్ర చర్మ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
ఈ క్రీమ్ ఎలా ఉపయోగించాలి?:
మెరిసే చర్మం కోసం ఇంట్లో తయారుచేసిన క్రీమ్‌ను వినియోగించడానికి ముందుగా..ముఖాన్ని శుభ్రం చేసుకుని కడగాల్సి ఉంటుంది. తర్వాత క్రీమ్‌ను ముఖానికి బాగా పట్టించి తేలికపాటి చేతులతో మసాజ్ చేయండి. అప్లై చేసిన క్రీమ్‌ను రాత్రంతా అప్లై చేసి ఉదయాన్నే శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. చర్మ సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
Also read: MP Avinash Reddy: వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు.. మొత్తం బయటపెట్టిన అవినాష్ రెడ్డి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook