Beetroot Leaves: మీకు తెలుసా..? బీట్‌రూట్ బరువు తగ్గిస్తుంది..!
Benefits Of Beetroot Leaves: బీట్‌రూట్ మాత్రమే కాకుండా వీటిని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయిని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి మేలు చేస్తాయి. అయితే బీట్‌రూట్ ఆకులు బరువు తగ్గించడంలో కీలక ప్రాత పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Benefits Of Beetroot Leaves: బీట్‌రూట్ అంటే మనకు తెలుసు, కానీ బీట్‌రూట్ ఆకుల గురించి చాలా మందికి తెలియదు. బీట్‌రూట్ మాదిరిగానే, దాని ఆకులు కూడా పోషకాల గని. వీటిని చాలా మంది వంటల్లో ఉపయోగించకపోయినా, వీటిలో అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం అధిక బరువు ఉన్నవారు బీట్‌రూట్ ఆకులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల సులువుగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ఈ ఆకులు శరీరంలో ఉండే కేలరీలను తగ్గించడంలో సహాయపడుతుంది.
బీట్‌రూట్ ఆకులు ఆరోగ్యలాభాలు:
బీట్‌రూట్ ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలక ప్రాత పోషిస్తుంది. ముఖ్యంగా ఈ ఆకులను చలికాలంలో డైట్‌లో భాగంగా తీసుకోవడం వల్ల వ్యాధుల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. బీట్‌రూట్ ఆకులో ఉండే నైట్రేట్లు రక్తనాళాలను విశాలం చేసి, రక్తపోటును తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలా మంది మహిళలు రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్యను తగ్గించడంలో బీట్‌రూట్ ఆకులు సహాయపడుతాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్తహీనతను తొలగిస్తుంది. గ్యాస్, మలబద్ధకం , అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు బీట్‌రూట్ ఆకులను చేర్చుకోవచ్చు. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ వ్యవస్థ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బీట్‌రూట్ ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించి, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీట్‌రూట్ ఆకుల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేస్తాయి, ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బీట్‌రూట్ ఆకుల్లో లుటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మాక్యులర్ డిజీజ్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీట్‌రూట్ ఆకులను ఎలా ఉపయోగించాలి:
సలాడ్‌లలో: బీట్‌రూట్ ఆకులను పాలకూరలాగే సలాడ్‌లలో ఉపయోగించవచ్చు. ఇవి సలాడ్‌కు ఒక ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి.
సూప్‌లలో: సూప్‌లు చేసేటప్పుడు బీట్‌రూట్ ఆకులను వేయవచ్చు. ఇవి సూప్‌కు ఒక ఆకుపచ్చని రంగును ఇస్తాయి, పోషక విలువను పెంచుతాయి.
స్మూతీలలో: మీ స్మూతీలలో బీట్‌రూట్ ఆకులను కలుపుకోవచ్చు. ఇవి స్మూతీకి ఒక ఆరోగ్యకరమైన బూస్ట్ ఇస్తాయి.
వెజిటబుల్ స్టఫింగ్‌లో: మీరు వెజిటబుల్ స్టఫింగ్ చేస్తున్నప్పుడు బీట్‌రూట్ ఆకులను ఉపయోగించవచ్చు.
పకోడీలు: బీట్‌రూట్ ఆకులతో పకోడీలు చేయవచ్చు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.
ముగింపు:
బీట్‌రూట్ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక అద్భుతమైన ఆహార పదార్థం. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా మీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
గమనిక: ఏదైనా ఆహార పదార్థాన్ని మీ ఆహారంలో చేర్చే ముందు, మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
ఇదీ చదవండి: ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపైనే బాంబు దాడులు.. వీడియో వైరల్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter