Benjamin Netanyahu House Bomb Attack: ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఇంటి పై శనివారం ఫ్లాష్ బాంబులతో దాడి చేశారు ముష్కరులు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారికంగా ధృవీకరించింది... ఈ నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి కాట్జ్ హద్దులు దాటుతున్నారు అంటూ పోస్ట్ చేశారు. హమాస్, హిజ్బోల్లా కలిసి ఇజ్రాయేల్‌పై దాడులకు దిగుతున్నాయి. ఇప్పుడు ఏకంగా ఆ దేశ ప్రధాన మంత్రి అయిన బెంజమిన్ నెతన్యాహు ఇంటిపై రెండు ఫ్లాష్ బాంబులతో విరుచుకు పడింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ బాంబు దాడి జరగగా నెతన్యాహు ఇంటి ఆవరణలో ఈ ఫ్లాష్ బాంబులు పడ్డాయి. ఆ సమయంలో ప్రధాన మంత్రి ఆయన సతీమణి ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది... అయితే ఈ దాడికి పాల్పడింది ఎవరూ అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. పోలీసులు, భద్రతా బలగాలు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సాధారణంగా నెతన్యాహు ఇక్కడే ఉంటారు. ఇది హైసెక్యూరిటీ జోన్‌గా కూడా పరిగణించారు. ఇదిలా ఉండగా అక్టోబర్ 18వ తేదీ కూడా ఇక్కడ బాంబు దాడులు నిర్వహించారు. అప్పుడు ఆ దాడికి కారణం మేమే అని హెజ్బొల్లా ప్రకటించిన సంగతి తెలిసిందే... ఈ ఫ్లాష్ దాడుల్లో నెతన్యాహు గార్డెన్ ఏరియాలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ బాంబు దాడి ఆదివారం తెల్లవారు జామున జరిగినట్లు తెలుస్తోంది. హింసను ఎప్పటికీ ఉపేక్షించేది లేదని ఇజ్రాయేల్ ప్రధాన అధికారులు పేర్కొన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని ఇప్పటికే హెచ్చరించారు.
ఇదీ చదవండి: తమ్ముడి పార్థీవ దేహంతో సొంతూరికి ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు అంత్యక్రియలు..
ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు లెబనాన్ పేజర్ పేళుల్లకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అంగీకరించారు....సెప్టెంబర్ నుంచి ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇప్పటకే ఇరాన్ హిజ్బొల్లా పెద్ద తలకాయలను కూడా కోల్పోయింది. ఇదిలా ఉండగా శనివారం కూడా హైఫాలో అటాక్ జరిగింది. తాజాగా ఆదివారం తెల్లవారు సమయంలో ఇలా ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి నెతన్యాహు ఇంటి ఆవరణలో ఫ్లాష్ బాంబుల దాడి జరిగినట్లు 'ఎక్స్' వేదికగా దేశ ఆర్థిక శాఖ మంత్రి కాట్జ్ తెలిపారు. ఈ దాడితో వారు రెడ్ లైన్ క్రాస్ చేశారు. ...దాడికీ ప్రతీకార చర్య ఉంటుందని చెప్పారు.
BREAKING:
🇮🇱 2 light bombs were identified that were shot close to Netanyahu's house in Caesarea and landed in the courtyard of the house. pic.twitter.com/k0ygeglfgc
— Mega Geopolitics (@MegaGeopolitics) November 16, 2024
ఇదీ చదవండి: రైతులకు రేవంత్ సర్కార్ బంపర్ గుడ్‌న్యూస్.. అకౌంట్లలో బోనస్ డబ్బులు జమా, వెంటనే చెక్ చేసుకోండి..!
ఇదిలా ఉండగా ఇజ్రాయేల్ ప్రెసిడెంట్ హర్జోగ్ ఐసాక్ కూడా ఈ దాడినీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి కారణమైన వారు ఎవరనేది వెంటనే తెలుసుకోవాలని షిన్ బెట్ హెడ్‌కు ఎక్స్ వేదికగా ఆదేశించారు. ప్రస్తుతం ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి ఇంటిపై జరిగిన ఫ్లాష్ బాంబులకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter