Akshaya Tritiya 2024: అక్షయతృతీయ రోజు లక్ష్మీపూజ చేయడం హిందూ సంప్రదాయంలో ఆనవాయితీ. ఈ ఏడాది అక్షయతృతీయ 2024 మే 10 శుక్రవారం నాడు జరుపుకోనున్నారు. ఈరోజు లక్ష్మీపూజ చేస్తే ధనలోటు ఉండదు. అక్షయతృతీయ బంగారం కొనుగోలు చేయడానికి కూడా ప్రత్యేకమైన రోజు. ఈరోజు చేసిన ఏ పని అయినా క్షయం కానిది. అంటే తరగనిది. ఈరోజు ధనానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తాం. అలాగే ఈరోజు లక్ష్మీ కటాక్షం పొందాలంటే ఈ నైవేధ్యం అమ్మవారికి సమర్పించాల్సిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మఖానా వీటిని తామరగింజలతో తయారు చేస్తారు. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా లక్ష్మీదేవి కూడా తామరపూవులోనే కూర్చొని దర్శనం ఇస్తుంది. అయితే, లక్ష్మీపూజలో తామరపూవును కూడా సమర్పిస్తారు. అయితే, తామర గింజలతో తయారు చేసే మఖానా ఖీర్‌ను కూడా అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఖీర్‌ను లక్ష్మీదేవికి పెడితే మీకు ధనలాభం కలిగి లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుంది. ఈ ఖీర్‌ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.


మఖానా ఖీర్ తయారీకి కావాల్సిన పదార్థాలు..
మఖానా -1 కప్పు
చక్కెర -11/2- కప్పు
పాలు -2 కప్పులు
డ్రైఫ్రూట్స్‌- అరకప్పు
నెయ్యి-100 గ్రాములు
యాలకులు-1 స్పూన్


ఇదీ చదవండి: వైశాఖ మాసంలో ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనంతమైన సంపదలు కురిపిస్తాడు..


మఖానా ఖీర్‌ తయారీ విధానం..
స్టవ్‌ ఆన్‌ చేసి ఓ ప్యాన్‌ పెట్టండి. అందులో నెయ్యి వేసి మఖానాను దోరగా వేయించండి. వీటిని పక్కకు తీసి అదే నెయ్యిలో డ్రైఫ్రూట్స్‌ కూడా గోల్డెన్‌ బ్రౌన్‌ రంగు వచ్చే వరకు వేయించండి. మరో ప్యాన్‌ తీసుకుని అందులో పాలు పోసి మరిగించుకోవాలి. పాలు ఉడికిన తర్వాత మఖానా వేసి ఉడికించుకోవాలి. దాదాపు సగం అయ్యే వరకు స్టవ్‌ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. పాలు దగ్గరగా అవుతున్నప్పుడు ఇందులో చక్కెర, డ్రైఫ్రూట్స్‌ వేసి కలపాలి.


ఇదీ చదవండి: అక్షయ తృతీయ రోజు ఈ ఒక్క పని చేస్తే సంవత్సరం పాటు రాజయోగం తథ్యం..


పైనుంచి యాలకుల పొడి కూడా వేసి ఓ ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి. ఇందులో కావాలంటే కుంకుమపూవు నీరు కూడా వేసుకుంటే మరింత రుచికరంగా ఖీర్‌ తయారవుతుంది. చివరగా ఇందులో నెయ్యి కూడా వేసుకుని స్టవ్‌ ఆఫ్ చేసేయండి టేస్టీగా లక్ష్మీదేవికి ఇష్టమైన మఖానా ఖీర్‌ రెడీ అయినట్లే. పైనుంచి మరికొన్ని డ్రైఫ్రూట్స్‌ కూడా వేసి గార్నిష్‌ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత అమ్మవారికి సమర్పించండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter