Olive Oil Benefits: రిఫైన్డ్, సోయాబీన్ ఆయిల్స్‌తో తీవ్ర వ్యాధులు తప్పవు, వీటికి బదులుగా ఈ నూనె బెస్ట్
Olive Oil Benefits: రిఫైన్డ్, సోయాబీన్ ఆయిల్స్ ప్రతి రోజు వినియోగించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ప్రాణాంతక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
Olive Oil Benefits: ప్రస్తుతం చాలా మంది రిఫైన్డ్, సోయాబీన్ వంటి నూనెలను వంటల్లో వినియోగిస్తున్నారు. అయితే ఈ నూనెలను వినియోగించడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ కూడా విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా వంటకాల్లో ఆరోగ్య నిపుణులు సూచించిన పలు నూనెలను వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఆయితే ఆహారాల్లో ఎలాంటి నూనెలను వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.
మరణించే ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
ఇటీవలే అధ్యయనాల్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. ప్రతి రోజు ఆహారాల్లో ఆలివ్ నూనెను వినియోగించడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా 5 శాతం మరణించే ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనాల్లో పేర్కొన్నారు. ఆలివ్ నూనెలో పాలీఫెనాల్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపు ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
వాపు ప్రమాదాన్ని తగ్గిస్తుంది:
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్‌కి చెందిన డైట్, న్యూట్రిషన్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మంట, వాపు వంటి చాలా సమస్యల నుంచి ఆలివ్ నూనె ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరం బరువును కూడా తగ్గిస్తాయి. తరచుగా వాపు సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ నూనెను వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:
ఆలివ్ ఆయిల్ గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 4 సంవత్సరాలుగా ప్రతిరోజూ ఆలివ్ నూనె తినడం ప్రారంభించిన వ్యక్తులు చెడు కొలెస్ట్రాల్ కరిగి మంచి కొలెస్ట్రాల్‌గా మారిందని వైద్య పరిశోధనల్లో వెల్లడించారు. అంతేకాకుండా డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఈ ఆయిల్ వినియోగించడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Minister KTR: వారికి సెలవులు రద్దు.. అధికారులకు కేటీఆర్ కీలక ఆదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి