వీడియో: ఏటీఎంలో వినాయకుడికి ప్రసాదం
వీడియో: ఏటీఎంలో వినాయకుడికి ప్రసాదం
సాంకేతికత, సాంప్రదాయాన్ని జోడిస్తూ ఓ వ్యక్తి రూపొందించిన ఏటీఎం జనాలను తెగ ఆకట్టుకొంటోంది. ఏటీఎంలో కార్డు పెడితే మొదక్‌లు (వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం) వస్తుండటంతో జనాలు ఏటీఎం వద్ద బారులు తీరుతున్నారు. పుణెలోని శంకర్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను వినాయక చవితి సందర్భంగా అక్కడ ఏర్పాటు చేశారు.
ఓ సృజనాత్మక ఆలోచనతో ముందుకు వచ్చిన పూణేలోని సంజీవ్ కులకర్ణి .. ఈ ఏటీఎం ఆవిష్కర్త. ఈ ఏటీఎం మెషిన్ ఏనుగు తల ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాడు సంజీవ్. ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ప్రత్యేకంగా రూపొందించిన కార్డును ఇన్సర్ట్ చేస్తే.. ఏటీఎం నుంచి మొదక్ వస్తుందన్నారు.
ఇది చూడటానికి ఒక సాధారణ ఏటీఎం వలె ఉంటుంది. ఈ లార్డ్ గణేష్ ఏటీఎంలో ఒక ప్రత్యేక కార్డును ఇన్సర్ట్ చేస్తే.. ప్యాక్ చేసిన మొదక్ వస్తుంది. ఈ ఏటీఎంలో బటన్లు కూడా ఉన్నాయి. కానీ నెంబర్లకు బదులుగా క్షమ, భక్తి, ప్రేమ, శాంతి, జ్ఞానం, ధార్మికత వంటి పదాలు వ్రాయబడ్డాయి.