Onion Facts: ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివేనా.. ఇవి తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Onion Facts In Telugu: అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ క్రింది సమస్యలతో బాధపడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే సమస్యలు ఉన్నవాళ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి.
Onion Facts In Telugu: ప్రస్తుతం చాలామంది ఆహారాల్లో ఎక్కువగా ఉల్లిపాయలను తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సలాడ్ గా కూడా ఉల్లిపాయలనే ఎక్కువగా తింటూ ఉంటారు. నిజానికి ఉల్లిపాయలను రోజు అతిగా తినడం మంచిదేనా.. ఇలా తినడంపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలుసా? అతిగా ఉల్లిపాయలను రోజూ తినడం వల్ల అనేక రకాల దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కొన్ని రకాల ప్రయోజనాలు కలిగించినప్పటికీ.. అతిగా తినడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..
ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:
జీర్ణ సమస్యలు:
పచ్చి ఉల్లిపాయలు అధికంగా తినడం వల్ల గ్యాస్, అసిడిటీ, మంట, వికారం వంటి జీర్ణ సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందిలో తీవ్ర పొట్ట సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఉల్లిని అతిగా తినడం మానుకుంటే చాలా మంచిది..
అలర్జీ:
కొంతమందిలో ఉల్లిపాయ అతిగా తినడం వల్ల అలర్జీ వంటి సమస్యలు కూడా రావచ్చు. ఇప్పటికే దురద ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉల్లిని అతిగా తినకపోవడం చాలా మంచిది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారు కూడా అతిగా ఉల్లిని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
రక్తం గడ్డ కట్టడం:
అతిగా ఉల్లిపాయలను తినడం వల్ల కొంతమందిలో రక్తం గడ్డకట్టే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే గుండె జబ్బులు స్ట్రోక్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారి ఎక్కువగా ఉల్లిపాయలను ఆహారంలో తినకపోవడం, సలాడ్లో తీసుకోకపోవడం ఎంతో మంచిది.
శ్వాసకోశ సమస్యలు:
కొంతమందిలో ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల శ్వాసకోశ సమస్యలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇప్పటికే ఆస్తమా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీటిని తినాలనుకునేవారు తప్పకుండా డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
నోటి దుర్వాసన:
కొంతమందిలో పచ్చి ఉల్లి పాయలు రోజు తింటే నోటి నుంచి దుర్వాసన కూడా రావచ్చు. ఇప్పటికే నోటిలోని దుర్వాసన వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా అతిగా ఉల్లిపాయలను తినకపోవడం చాలా మంచిది.
చర్మ సమస్యలు:
కొంతమందిలో అతిగా ఉల్లిని తినడం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చర్మంపై బొబ్బలు, దురద వంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ఉల్లిపాయలను తీసుకోవడం మానేయాలి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.