Orange Fruit Benefits: ఆరెంజ్‌ పండును ఇష్టపడనివారు  ఉండరు. ఇందులో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. దీని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. ఆరోగ్యనిపుణుల ప్రకారం ప్రతిరోజు ఒక ఆరెంజ్‌ పండు తినడం వల్ల శరీరానికి మంచి ఫలితాలు కలుగుతాయిని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆరెంజ్‌ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు , నష్టాలు గురించి తెలుసుకుందాం. 
ఆరెంజ్ పండు ఒక రుచికరమైన మరియు పోషక విలువలు కలిగిన పండు. ఇది విటమిన్ సి యొక్క అద్భుతమైన మూలం, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అయితే, ప్రతిదానిలాగే ఆరెంజ్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉండవచ్చు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆరెంజ్ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


ఆరెంజ్‌ లో విటమిన్‌ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. దీని వల్ల జలుబు, దగ్గు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు. కాంతివంతంమైన చర్మం కోసం కూడా ఆరెంజ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి. గుండె సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా ఆరెంజ్‌ పండు తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ రాకుండా సహాయపడుతుంది.  
గ్యాస్‌, మలబద్ధకం వంటి  సమస్యలకు కూడా ఆరెంజ్‌ సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ బారిన పడకుండా సహాయపడుతుంది. ఆరెంజ్‌ నేరుగా తినడానికి ఇష్టపడనివారు దీంతో తయారు చేసే జ్యూస్‌ను తాగవచ్చు. 


అయితే ఆరెంజ్‌ ఆరోగ్యకరమైన పండు అయినప్పటికి కొన్ని సార్లు శరీరానికి నష్టం కలిగిస్తుంది. ఆరెంజ్‌ ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ లెవెల్స్‌ ఎక్కువగా పెరుగుతాయి. దీని వల్ల కడుపు సమస్యలు పెరుగుతాయి. అలాగే అధిక ఫ్రక్టోజ్ కంటెంట్ వల్ల బరువు పెరగడానికి దారితీయవచ్చు. ఆరెంజ్‌లోని ఆమ్లాలు దంతాల ఎనామెల్‌ను దెబ్బతీస్తుందని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. 


ఆరెంజ్‌ తినడం వల్ల అలెర్జీ సమస్యలు కలిగే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. ఆరెంజ్‌లో చక్కెర అధికంగా ఉండటం వల్ల షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా తీసుకోవాలి.
మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు ఆరెంజ్ తీసుకోవడం మానుకోవాలి. ఆరెంజ్‌ను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఏదైనా ఆహారం అధికంగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం.


గమనించండి: ఈ సమాచారం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నట్లయితే, మీరు మీ వైద్యుడిని సంప్రదించాలి.


Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook