Palak Pakoda Recipe In Telugu: పిల్లల నుంచి పెద్దవారి వరకు పకోడీ అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. కొంతమందైతే సాయంత్ర పూట స్నాక్స్‌గా తరచుగా తీసుకుంటారు. నిజానికి చాలా మందికి ఉల్లితో తయారు చేసిన పకోడాను రోజు తినడం వల్ల బోర్‌ కొడుతూ ఉంటుంది. అయితే ఇలాంటి వారి కోసం ఈ రోజు ఓ ప్రత్యేకమైన పకోడీ రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అదేంటో కాదు అందిరికీ తెలిసిందే పాలకూర పకోడీ.. దీనిని పాలకూర ఎక్కువగా వేసి తయారు చేసుకుని ఆహారాల్లో తీసుకుంటే శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. దీంతో పాటు పాలకూరలో విటమిన్ A, Cతో పాటు తక్కు కేలరీలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు సాయంత్రం పూట స్నాక్స్గా తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో, దీని కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకూర పకోడీకి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల తురిమిన పాలకూర 
1/2 కప్పు శనగపిండి
1/4 కప్పుల తరిగిన కొత్తిమీర 
1/2 అంగుళం తురిమిన అల్లం
2-3 పచ్చిమిరపకాయలు 
1/2 టీస్పూన్ జీలకర్ర
1/4 టీస్పూన్ పసుపు
1/4 టీస్పూన్ ఉప్పు
వేయించడానికి నూనె 


తయారీ విధానం:
పాలకూర పకోడీ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ గిన్నెలో పాలకూర, బెసన్, కొత్తిమీర, అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇలా బాగా మిక్స్‌ చేసుకున్న పిండిలో కొంచెం కొంచెం నీటిని పోస్తూ బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. 
మిక్స్‌ చేసుకున్న పిండిని బాగా కలుపుకుని 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. 
ఒక పాన్‌లో నూనె వేడి చేసి, పిండి మిశ్రమాన్ని పకోడీలా వేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పకోడీ బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు వేయించాల్సి ఉంటుంది.
రంగు మారిన వెంటనే గిన్నెలోకి తీసుకుని నిమ్మరసం పిండుకుని తింటే భలే ఉంటుంది.
వేడి వేడిగా, మీకు ఇష్టమైన చట్నీతో కలిసి కూడా సర్వ్ చేసుకోవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
పకోడీలు మరింత రుచిగా ఉండాలంటే, మీరు వాటిలో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు లేదా తరిగిన క్యాప్సికమ్ కూడా కలుపుకోవచ్చు.
పిండి చాలా గట్టిగా ఉంటే, కొద్దిగా నీటీని కలిపి పలుచగా చేసుకోవాల్సి ఉంటుంది. 
పకోడీలను ఎక్కువ సేపు నూనెలో వేయించకుండా జాగ్రత్త వహించండి.
వేడి వేడిగా తినడానికి ముందు, పకోడీలను బటర్‌ పేపర్‌పై ఉంచితే చాలు..


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి