Palak Salad Recipe: పాలకూరలో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో  విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావాల్సిన విటమిన్ A, విటమిన్ C, ఐరన్, కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. కాబట్టి దీనిని వారంలో ఒక్కరోజైనా ఆహారంలో చేర్చుకుంటే శరీర ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా దీనిని సలాడ్‌లా తయారు చేసుకుని తీసుకుంటే సులభంగా బరువుతో పాటు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈ పాల కూరను వివిధ పద్ధతుల్లో సలాడ్స్‌ లాగా తయారు చేసుకోవచ్చు. కానీ మేము తెలిపిన పద్ధతిలో సలాడ్‌ తయారు చేసుకుని తింటే సులభంగా బరువు తగ్గడమే కాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఈ సలాడ్‌ను ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలేంటో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలకూర సలాడ్‌కి కావాల్సిన పదార్థాలు:
2 కప్పుల తాజా పాలకూర(తరిగిన)
1/2 కప్పు తెల్ల శనగలు
1/4 కప్పు టమాటాలు(తరిగిన)
1/4 కప్పు ఉల్లిపాయ(తరిగిన)
1/4 కప్పు కొత్తిమీర(తరిగిన)
2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం
1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె
1/2 టీస్పూన్ ఉప్పు
1/4 టీస్పూన్ నల్ల మిరియాలు


తయారీ విధానం:
పాలకూర సలాడ్‌ తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకోవాల్సి ఉంటుంది.
ఒక పెద్ద గిన్నెలో, పాలకూర, వెండిగడ్డ, టమాటాలు, ఉల్లిపాయ, కొత్తిమీరను వేసి బాగా కలపాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం, ఆలివ్ నూనె, ఉప్పు, మిరియాలు వేసి వాటిని కూడా బాగా కలుపుకోవాల్సి ఉంటుంది.
ఇలా తయారు చేసిన తర్వాత డ్రెస్సింగ్‌ను సలాడ్‌పై పోసి బాగా కలపండి.
ఇలా తయారు చేసుకున్న సలాడ్‌పై పెప్పర్‌ పౌడర్‌ వేసుకుని తినొచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


చిట్కాలు:
ఈ సలాడ్‌ను మరింత రుచిగా చేసుకోవడానికి కొన్ని వేయించిన బాదంపప్పులు లేదా వాల్‌నట్‌లను కూడా వేసుకోవచ్చు.
కొంచెం పులుపు కావాలంటే డ్రెస్సింగ్‌కు కొద్దిగా నిమ్మరసం లేదా ద్రాక్షరసం కూడా వేసుకోవచ్చు.
సలాడ్‌ నుంచి మరింత ప్రోటీన్ అందడానికి ఉడికించిన కోడి గుడ్లు కూడా వేసుకోవచ్చు.
ఈ సలాడ్‌ను శాండ్‌విచ్‌లో లేదా ర్యాప్‌లో కూడా ఉపయోగించవచ్చు.


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి