Papaya Benefits: బొప్పాయి పండుతో శరీరానికి ఇన్ని ప్రయోజనాలా..!!
Papaya Benefits: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిని పండుగా ఉన్నప్పుడు తినోచ్చు..కాయా స్థితిలో ఉన్నప్పుడు కూడా తినోచ్చు. బొప్పాయలో ఉండే గుణాలు పొట్టకు చాలా మేలు చేస్తుంది.
Papaya Benefits: బొప్పాయి పండు పేరు చెప్పగానే చాలా మందికి నోరు ఊరుతుంది. దీనిని పండుగా ఉన్నప్పుడు తినోచ్చు..కాయా స్థితిలో ఉన్నప్పుడు కూడా తినోచ్చు. బొప్పాయలో ఉండే గుణాలు పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఈ పండును మొదట భారత్‌లో 16వ శతాబ్దంలో కనుగొన్నారు. ఇది ప్రపంచ వ్యప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందింది. అన్ని దేశాలతో పోలిస్తే దీనిని భారత్‌లో అధికంగా పండిస్తున్నారు.
ఆయుర్వేద గ్రంథాలలో బొప్పాయి గురించి:
భారతదేశంలోని పురాతన గ్రంథమైన ఆయుర్వేద శాస్త్రంలో బొప్పాయి గురించి ఎలాంటి అంశాలను వివరించాలేదు. అయితే ఈ పండు గురించి..మహాకవి కాళిదాసు 3వ-4వ శతాబ్దంలో 'మేఘదూత్' అనే మహాకావ్యాన్ని రచించాడు. మహాకావ్యంలో దీని గురించి వర్ణించారు. కానీ బొప్పాయి గురించి పురాణం ఎక్కడా వర్ణించ లేదు. దీన్ని బట్టి చూస్తే ఈ పండు భారతదేశానికి ఇటీవలే కాలంలో వచ్చిందని స్పష్టమవుతోంది. మార్కెట్‌లో ఈ పండు అధికంగా విక్రయించడంతో ఈ పండు డిమాండ్ పెరిగింది.
16వ శతాబ్దంలో బొప్పాయి:
నివేదికలు ఇచ్చిన సమాచారం ప్రకారం..బొప్పాయి విత్తనాలు 16 వ శతాబ్దంలో భారతదేశానికి వచ్చాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇక్కడి నుంచి నెమ్మదిగా చైనా, ఇటలీలకి కూడా చేరుకున్నాయి. ఇప్పుడు బొప్పాయి ప్రపంచవ్యాప్తంగా, పసిఫిక్ దీవులలోని దాదాపు అన్ని ఉష్ణమండల ప్రాంతాలలో ఈ పండు ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ప్రపంచంలోనే బొప్పాయిని అత్యధికంగా భారత్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచంలోని బొప్పాయిలో 35 శాతం భారతదేశంలోనే ఉత్పత్తి అవ్వడం విశేషం. ఈ పండు ఉత్పత్తి భారతదేశంలో నిరంతరం పెరుగుతోంది. నేషనల్ హార్టికల్చర్ బోర్డ్ ప్రకారం.. బొప్పాయిని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, అస్సాం, తమిళనాడు, కేరళలుగా ఉన్నాయి.
బొప్పాయితో ప్రయోజనాలు:
ఆచార్య బాలకృష్ణ బొప్పాయి పండు గురించి ఈ విధంగా వివరించారు..బొప్పాయిలో అనేక పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఇందులో చాలా ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు, శక్తి మొదలైనవి ఉన్నాయి. దీంలో శరీరంలో రోగని రోధక శక్తి పెరిగి..ఇది అనేక వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. బొప్పాయి రూచి సహజంగా చేదు, ఘాటుగా ఉంటుంది. కావున శరీరలో వాపులను తగ్గించి..జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుతుంది.
Also Read: Black Pepper With Ghee Benefits: నల్ల మిరియాలు, నెయ్యితో కలిపిన మిశ్రమం జ్ఞాపకశక్తిని పెంచుతుంది..!!
Also Read: Amla juice benefits: ఉసిరికాయ రసంతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook