Perfect Time For Yoga: యోగా మనసును ప్రశాంతంగా చేసే ఓ సాధన. మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి యోగా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా కొందరు ప్రతి రోజూ యోగా చేసి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నారిని పలు నివేదికలు తెలిపాయి. ఇది శరీరానికి బలాన్నిఇవ్వడమే కాకుండా.. మనస్సు ఏకాగ్రతను పెంచుతుంది. యోగాలో చేసే సాధనను యోగాసనాలు అని పిలుస్తారు. వీటిని క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరం దృఢంగా అవ్వడమే కాకుండా అనేక రకాల శరీర సమస్యలు దూరమవుతాయని యోగా నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యోగాను ప్రతిరోజూ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల శరీర శక్తి పెరగడమేకాకుండా.. భావోద్వేగాలు తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా మానసిక ఆరోగ్యం మెరుగుపడి బాడీ ఫిట్‌గా మారుతుందని యోగా నిపుణులు చెబుతున్నారు. కానీ యోగాను చాలా మంది చేయ కూడని సమయాల్లో చేస్తున్నారు ఇలా చేయడం వల్ల దీని ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


యోగాను చేసే ముందు ఈ నియమాలు తప్పకుండా పాటించాలి:


ఉదయం పూట యోగా చేయడం చాలా మేలు:


యోగా చేయడానికి సరైన సమయం ఉదయమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ ఉదయం టిఫిన్‌ తినే ముందు యోగా సాధన చేయాలని పలు హెల్త్‌ నివేదికలు పేర్కొన్నాయి. సాధన చేసే క్రమంలో కడుపు తేలికగా, ఖాళీగా ఉండటం మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.


యోగా చేస్తున్నప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి:


యోగా చేసే క్రమంలో సాధన కోసం కొంత సమయాన్ని కేటాయించండి. తద్వారా యోగా చేసేటప్పుడు మనస్సు ప్రశాంతంగా, ఒత్తిడి లేకుండా ఉంటుంది. అంతేకాకుండా శరీరాన్ని  ప్రశాంత స్థితిలో ఉంచడం అవసరమని యోగా నిపుణులు పేర్కొన్నారు.


ఇలా చేస్తేనే ప్రయోజనం పొందుతారు:


యోగా ద్వారా సరైన ప్రయోజనాన్ని పొందడానికి.. పలు నియమాలను పాటించడం చాలా అవసరం. అందుకే యోగా కోసం ఉదయం సమయంలో ప్రతిరోజూ యోగా చేయండి.


జాగ్రత్తగా యోగా చేయండి:


రోజుకు యోగాను ఒకటి లేదా రెండుసార్లు చేయోచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధనాలను మొదటి సారి చేసే వారు తప్పకుండా అన్ని వివరాలు తెలుసుకుని ప్రారంభించడం మేలు.  సరైన మార్గంలో యోగా చేస్తే శారీరక, మానసిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


Also Read:  Health Benefits Of Egg Yolk : గుడ్డు పచ్చసొన తినడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..!


Also Read:  Monsoon Diet: వర్షాకాలంలో చైనీస్ ఫుడ్‌ తింటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook