Pigeon Pea Benefit: డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ పన్నును ట్రై చేయండి..!
Pigeon Pea Benefit: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు ఒక కుంటుంబంలో ఒకరు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి.
Pigeon Pea Benefit: అధునిక జీవన శైలి కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఈ సమస్యకు ఒక కుంటుంబంలో ఒకరు గురవుతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. డయాబెటిస్ కొందరికి జన్యు పరంగా వస్తే మరి కొందరికి ఆహారం అలవాట్ల వల్ల వస్తందని అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ సమస్యల నంచి ఉపశమనం పొందడానికి కొన్ని రకాల పప్పులను ఆహారంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహ ఉన్న వారు ఈ పప్పును క్రమం తప్పకుండా తినాలి:
క్రమం తప్పకుండా ఆహారంలో తృణధాన్యాలను తీసుకోవాలి. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. అంతేకాకుండా ఇవి కండరాలను నిర్మాణానికి ఎంతగానో సహాయపడతాయి. ముఖ్యంగా పచ్చి బఠానీని రోజూ తింటే రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
ఈ పప్పు తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి:
1. బ్లడ్‌లో షుగర్ కంట్రోల్ అవుతుంది:
డయాబెటిక్ పేషెంట్ క్రమం తప్పకుండా.. బఠానీని ఎక్కువగా తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్ల స్థాయి అధికంగా ఉంటుంది. కావున రక్తంలోని షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తుంది. అంతేకాకుండా ఇవి శరీరాన్ని దృఢంగా చేస్తుంది.
2. జీర్ణక్రియ మెరుగు పడుతుంది:
బఠానీ పప్పులో ఫైబర్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. జీర్ణక్రియను ఆరోగ్యంగా చేస్తుంది. అంతేకాకుండా ఇవి మధుమేహ వ్యాధి గ్రస్తులు తీసుకుంటే వారిలో రోగనిరోధక శక్తి పెరిగి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
3. బరువును తగ్గిస్తుంది:
క్రమం తప్పకుండా బఠానీ పప్పును తీసుకుంటే.. పెరుగుతున్న బరువు వేగంగా తగ్గే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ పప్పులో ఫైబర్ పరిమాణం పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని నియంత్రించేందుకు కృషి చేస్తుంది.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Cancer Medicine: వైద్య చరిత్రలో సరికొత్త ఆవిష్కరణ, కేన్సర్‌కు కొత్త మందు సక్సెస్, పూర్తి వివరాలివే
Also Read: Ringworm Remedies: చర్మంపై తామర సమస్యతో బాధపడుతున్నారా.. అయితే సులభంగా ఉపశమనం పొందండి..!
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook