Benefits of Mushrooms: భారత్‌లో పుట్టగొడుగులు విచ్చల విడిగా లభిస్తాయి. ప్రస్తుతం వీటి వినియోగం పెరడం వల్ల మష్రూమ్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. పుట్టగొడుగులను వివిధ రకాలుగా వినియోగిస్తారు. వెజ్, నాన్ వెజ్ వంటకాల్లో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇందులో చాలా రకాల పోషకాలు ఉంటాయి. కావున ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మష్రూమ్స్‌లో విటమిన్లు, మినరల్స్, అమినో యాసిడ్స్ ఉన్నందున ఆరోగ్యానికి దివ్యౌషధంగా పని చేస్తుంది. ప్రస్తుతం చాలా మంది దాని ప్రయోజనాలను తెలుసుకోకుండా కేవలం దాని రుచి చూసి తినడానికి ఇష్టపడతారు. అయితే పుట్టగొడుగులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
వివిధ వ్యాధులను దూరం చేస్తుంది:
పుట్టగొడుగుల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా శరీరానికి యాంటీబయాటిక్‌గా పని చేస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని కణాలను రిపేర్ చేస్తుంది.
హృదయా సంబంధిత సమస్యలకు చెక్ పెడుతుంది:
పుట్టగొడుగుల్లో పోషకాలు, అనేక రకాల ఎంజైమ్‌లు ఉంటాయి. వీటి వల్ల హృదయ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. మష్రూమ్స్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి హాయపడతాయి.
కడుపు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల మలబద్ధకం, అజీర్ణం మొదలైన పొట్ట సమస్యలు దూరమవుతాయి. ఇందులో ఫోలిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉంటాయి. కావున శరీరంలో రక్తాన్ని శుభ్రపరుచుతాయి.
బలమైన ఎముకల కోసం:
మష్రూమ్స్‌లో ఉండే గుణాల వల్ల ఎముకలు బలపడతాయి. అంతేకాకుండా ఎముకల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
వృద్ధాప్యానికి బాయ్ బాయ్:
మష్రూమ్ చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. వీటిలో ఉండే విటమిన్లు చర్మం వృద్ధాప్యంగా మారకుండా కాపాడుతాయి.
Also Read: Control Cholesterol Level: శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు ఇవే.. వీటికి దూరంగా ఉండండి..!
Also Read: Health Tips: కిచెన్ హెర్బ్స్.. ఈ ఐదింటితో అధిక బరువుకు చెక్.. సహజంగా బరువు తగ్గేయొచ్చు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook