Acne Tells Health: మీ ముఖం మీద ఉన్న మొటిమ మీ ఆరోగ్యం గురించి ఏమి చెబుతాయో తెలిస్తే షాక్ అవుతారు
Acne Impact On Health: చర్మంపైన ఇతర భాగాల్లో మొటిమలు రావడం చాలా సాధారణ విషయం. కానీ ఆరోగ్యనిపుణులు ప్రకారం మొటిమలు కొన్ని శరీర భాగాల్లో కనిపిస్తే అవి అనారోగ్య సమస్యలకు సంకేతాలని వారు చెబుతున్నారు.
Acne Impact On Health: మన ముఖం మన ఆరోగ్యం గురించి చాలా చెబుతుంది. మొటిమలు సాధారణ చర్మ సమస్య అయినప్పటికీ అవి మన ఆహారం, హార్మోన్లు జీవనశైలి గురించి కూడా సూచనలు ఇవ్వగలవు. మీ మొటిమలు ఎక్కడ కనిపిస్తున్నాయో బట్టి, అవి మన ఆహారం, హార్మోన్లు, జీవనశైలి గురించి కూడా సూచనలు చెబుతాయి.
అయితే మొటిమలు సాధారణంగా ముఖం, ఛాతీ, వెనుక భాగంలోని హెయిర్ ఫోలికల్స్‌ను ప్రభావితం చేసే చర్మ పరిస్థితి అయిన మొటిమల వల్గారిస్ వల్ల వస్తాయి. హెయిర్ ఫోలికల్ ఒక చిన్న రంధ్రం, ఇందులో ఒక జుట్టు, సెబమ్ అనే నూనెను ఉత్పత్తి చేసే సెబాషియస్ గ్రంధి ఉంటుంది. సెబమ్ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. కానీ చాలా ఎక్కువ సెబమ్ ఉత్పత్తి అయితే లేదా రంధ్రాలు మృత చర్మ కణాలు బ్యాక్టీరియాతో మూసుకుపోతే, అది మొటిమలకు దారితీస్తుంది.
ఆరోగ్యనిపుణులు ప్రకారం మొటిమలు వచ్చే భాగంలో కొన్ని ఆరోగ్య సమస్యల గురించి మనకు సూచనలు ఇస్తుందని చెబుతున్నారు. అయితే ఏ భాగంలో మొటిమలు రావడం వల్ల ఏ అనారోగ్యసమస్యకు సూచన అనేది మనం తెలుసుకుందాం.
మనలో చాలా మందికి నుదిటిపైన మొటిమలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఆరోగ్యనిపుణుల ప్రకారం ఈ మొటిమలు కనిపించడం అనేది కడుపు, ఆహార వినియోగానికి సంబంధించిదని చెబుతున్నారు. అతిగా జంక్ ఫుడ్, షుగర్ కంటెంట్ పదార్థాలు తీసుకోవడం వల్ల ఇలా మొటిమలు వస్తాయి. ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకొనేవారు ఎక్కువ శాతం నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. దీని మీరు పట్టించుకోకపోతే కడుపు ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
మీ కనుబొమ్మల మధ్య మొటిమ కాలేయ సమస్యలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. అయితే, మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్‌లతో సమతుల్య ఆహారం తినండి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర, అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులను పరిమితం చేయండి. వారానికి చాలా రోజులు కనీసం 30 నిమిషాల మితమైన వ్యాయామం చేయండి.
ధూమపానం మీ కాలేయానికి హాని కలిగిస్తుంది, సిర్రోసిస్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మొటిమలు నుదిటి పైన ఎక్కువగా కనిపిస్తే మూత్రాశయంలో సమస్య ఉన్నట్లు సంకేతంమని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కోసం మీరు శరీరాన్ని ఎల్లప్పుడు హైడ్రేట్‌గా ఉంచుకోవాలి. వాటర్ బాటిల్ తో శరీరానికి కావాల్సిన నీరును తీసుకోవాల్సి ఉంటుంది. నీరుతో పాటు ఫ్రూట్స్, కూరగాయలు మీ ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది.
ముక్కుపైన మొటిమలు ఉంటే గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని వల్ల రక్తపోటు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్న ఇలా మొటిమలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి లోపం ఉన్నప్పుడు మొటిమలు వస్తాయి. దీని కోసం మీరు వైద్యుడి సలహాతో విటమిన్ బి సప్లిమెంట్లు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి