COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Pineapple Cake Recipe: కేక్‌లు అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. దీనిని ఒక్కొక్కరూ ఒక్కొక్క ఫ్లేవర్‌తో తయారు చేసుకుంటారు. అందరూ వెన్నిలా, ఫైనాఫిల్‌ ఫ్లెవర్‌తో తయారు చేసిన కేక్‌లను తినేందుకు ఇష్టపడతారు. దీనిని కూడా వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఫైనాఫిల్ కేక్‌ను మిల్లెన్స్‌ పిండితో కూడా తయారు చేసుకుంటారు. ఈ పిండితో తయారు చేసిన కేక్‌ను తినడం వల్ల పిల్లలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. చాలా మంది దీనిని బేకరీ షాపుల్లో తయారు చేసినవి విక్రయిస్తూ ఉంటారు. నిజానికి వీటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. 


ఫైనాఫిల్ కేక్‌కి తయారీకి కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి: 2 కప్పులు
బేకింగ్ పౌడర్: 1 టీస్పూన్
బేకింగ్ సోడా: 1/2 టీస్పూన్
ఉప్పు: 1/4 టీస్పూన్
వెన్న: 1 కప్పు (రూమ్ టెంపరేచర్ వద్ద)
చక్కెర: 1 1/2 కప్పులు
గుడ్లు: 2 పెద్దవి
వెనిలా ఎసెన్స్: 1 టీస్పూన్
పాలు: 1 కప్పు
చాక్లెట్ చిప్స్: 1 కప్పు


తయారీ విధానం:
ఒక గిన్నెలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాతో పాటు ఉప్పు వేసి బాగా మిక్స్‌ చేయాల్సి ఉంటుంది.
మరొక గిన్నెలో వెన్న, చక్కెరను వేసి బాగా క్రీములాగా మిక్స్‌ చేసుకోవాలి.
ఆ తర్వాత గుడ్లు ఒక్కొక్కటిగా వేసి, ప్రతిసారీ బాగా కలుపుతూ మిశ్రమంలా తయారు చేసుకోండి.
బాగా మిక్స్‌ చేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్, పాలు వేసుకుని బాగా మిక్స్‌ చేసుకోండి.
ఆ తర్వాత పొడి పదార్థాలను పాలు, వెన్న మిశ్రమంలో క్రమంగా వేస్తూ బాగా కలపండి.
చివరగా, చాక్లెట్ చిప్స్ (మీరు ఉపయోగించాలనుకుంటే) కలపండి.
గ్రీజ్ చేసి, పిండి వేసిన కేక్ పాన్‌లో బ్యాటర్‌ను పోయాలి.
ఆ తర్వాత 180 డిగ్రీల సెల్సియస్‌కు వేడి చేసిన ఓవెన్‌లో 30 నుంచి 35 నిమిషాలు లేదా టూత్‌పిక్ శుభ్రంగా బయటకు వచ్చే వరకు ఉడికించాల్సి ఉంటుంది.
కేక్‌ను ఓవెన్ నుంచి తీసి చల్లారిన తర్వాత సర్వ్‌ చేసుకోండి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


చిట్కాలు:
రుచిని పెంచుకోవడానికి కేక్ బ్యాటర్‌కు 1/2 కప్పు సోర్ క్రీమ్ లేదా యాపిల్‌సాస్ కలపవచ్చు.
చాక్లెట్ చిప్స్‌కు బదులుగా ఎండుద్రాక్షలు, వాల్‌నట్స్ లేదా ఇతర నట్స్‌ను కూడా ఉపయోగించవచ్చు.
 క్రీము ఫ్రాస్టింగ్ కావాలంటే, 1 కప్పు వెన్న, 2 కప్పులు పౌడర్ చక్కెర, 1 టీస్పూన్ వెనిలా ఎసెన్స్, 2-3 టేబుల్ స్పూన్ల పాలు కలపండి.
ఛాక్లెట్ ఫ్రాస్టింగ్ తయారు చేసుకోవాలనుకునేవారు. ఒక బౌల్‌లో 1/2 కప్పు వెన్న, 1/2 కప్పు పౌడర్ చక్కెర, 1/4 కప్పు కోకో పౌడర్, 1 టీస్పూన్ వెనిలా ఎసెన్స్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల పాలు కలపండి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి